iDreamPost
android-app
ios-app

Liquor Prices: మందుబాబుల‌కు భారీ షాక్‌.. ఈ డ్రింక్స్‌ను ఇక తాగలేరు?

Liquor prices: నేటికాలం మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కొందరికి మందు తాగనిదే.. రోజు మొదలు కాదు. అయితే ఇలాంటి మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ షాకింగ్ వార్త చెప్పింది.

Liquor prices: నేటికాలం మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కొందరికి మందు తాగనిదే.. రోజు మొదలు కాదు. అయితే ఇలాంటి మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ షాకింగ్ వార్త చెప్పింది.

Liquor Prices: మందుబాబుల‌కు భారీ షాక్‌.. ఈ డ్రింక్స్‌ను ఇక తాగలేరు?

చాలా మంది ఏదో ఒకదానికి బానిసలు గా మారుతుంటారు. అయితే వీటిల్లో కొన్ని మంచివి కాగా మరికొన్ని చేటు చేసేవి ఉంటాయి. ముఖ్యంగా జూదం, మద్యం వంటి వాటికి బానిసలుగా మారిన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మద్యం కారణంగా జరుగుతున్న ఘోరాలకు అంతేలేదు. ఇలా మద్యం కారణంగా జరిగే ఘోరల గురించి పక్కన పెడితే.. కొందరికి మందు తాగానిదే రోజూ ప్రారంభం కాదు. ఇక సండే, ఇతర ప్రత్యేక వేడుకులు ఉంటే..ఇక మద్యం తప్పనిసరి. అయితే తాజాగా మందుబాబులకు ఓ రాష్ట్ర ప్రభుత్వం ఓ భారీ షాక్ ఇచ్చింది. మరి.. ఆ షాక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మందుబాబులకు మద్యం లేనిదే రోజు గడవదు. అన్నం లేకున్న ఉండగలరు కానీ మద్యం లేకుంటే మాత్రం ఉండలేరు. అలానే మరికొందరు సండే వచ్చిందంటే చాలు చుక్క, ముక్కతో ఫడేగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా అకేషన్ ఏదైన మద్యం మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇలా ప్రతిరోజూ మద్యంతో పండగ చేసుకునే మందు బాబులకు కర్నాటక ప్రభుత్వం భారీ షాకే ఇవ్వనుందని సమాచారం. త్వ‌ర‌లో మ‌ద్యం ధ‌ర‌ల్లో కీలక మార్పులు ఉంటాయని తెలిపింది. వివిధ కేట‌గిరీల మ‌ద్యానికి ప‌న్ను శ్లాబులు స‌వ‌రించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది. దీని వ‌ల్ల బీర్లల‌తో పాటు ప్ర‌ముఖ బ్రాండ్ల మద్యం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉండనున్నట్లు సమాచారం. ప్రీమియం బ్రాండ్ల ధ‌ర‌ల్లో స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల ఉండ‌నున్నట్లు తెలుస్తోంది.

శుక్ర‌వారం కర్ణాటక అసెంబ్లీలో బ‌డ్జెట్ పై చర్చ జరిగింది. ఇక ఈ సమావేశంలోముఖ్యమంత్రి సిద్ధరామయ్య మద్యం విషయాన్ని ప్రస్తావించారు. బీరు, ఇండియన్ మేడ్ లిక్కర్ ధరలను పెంచాలని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. పన్ను స్లాబ్‌లను హేతుబద్ధీకరించ‌డం, పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి ధరలు పోటీ ప‌డేలా చేయ‌డం దీని ఉద్దేశమని ఆయన చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఐఎంఎల్, బీర్‌లకు పన్ను స్లాబ్‌లను సవరించడం జరుగుతుంద‌ని తెలిపారు.

ఇక కొత్త పన్ను స్లాబ్ లు అమల్లోకి వస్తే.. బీర్ తో పాటు ఇతర ఐఎంఎల్ డ్రింక్స్ ప్రియం అయ్యే అవకాశం  ఉంది. ఇదే సమయంలో ప్రీమియం బ్రాండ్ ధ‌ర‌ల్లో త‌గ్గుదల ఉండనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖకు ఆదాయ సేకరణ లక్ష్యం రూ.38,525 కోట్లుగా నిర్ణయించినట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మద్యం విషయంలో తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీటి ధరల విషయంలో, అలానే టైమింగ్స్ లో మార్పులు వంటివి వాటిపై న్యూస్ అనేది వస్తుంటుంది. మరి..మద్యంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.