Keerthi
నేడు దేశవ్యాప్తంగా ఎక‍్కడ చూసిన ఈ ఎన్నికల పండగ జరగుతున్న విషయం తెలిసిందే. దీనికోసం కోసం బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఏ పరిస్థితిలో ఉన్నా.. ఎక్కడవున్నా సరే ఓటు వేయడానికి వచ్చిన సంఘటనలు ఎన్నో చూసి ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ వృద్ధురాలు క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్నా కూడా ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించుకుంది.
నేడు దేశవ్యాప్తంగా ఎక‍్కడ చూసిన ఈ ఎన్నికల పండగ జరగుతున్న విషయం తెలిసిందే. దీనికోసం కోసం బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఏ పరిస్థితిలో ఉన్నా.. ఎక్కడవున్నా సరే ఓటు వేయడానికి వచ్చిన సంఘటనలు ఎన్నో చూసి ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ వృద్ధురాలు క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్నా కూడా ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించుకుంది.
Keerthi
ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండగ ఏదీ అంటే.. అది ఎన్నికల పండగ అని చెప్పవచ్చు. కాగా, నేడు దేశవ్యాప్తంగా ఎక‍్కడ చూసిన ఈ ఎన్నికల పండగ జరగుతున్న విషయం తెలిసిందే. దీనికోసం కోసం బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఏ పరిస్థితిలో ఉన్నా.. ఎక్కడవున్నా సరే ఓటు వేయడానికి వచ్చిన సంఘటనలు ఎన్నో చూసి ఉంటాం. ఎందుకంటే.. ఓటు వేసి దేశ భవిష్యత్తు నిర్ణయించే హక్కు, భాద్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. అలాంటి ఓటు హక్కును వినియోగించుకోకుండా.. కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయిన ఓ వృద్ధురాలు మాత్రం ఓటు కోసం చివరి దశలో ఉన్నా క్యాన్సర్ తో పోరాడి తన ఓటును వినియోగించుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకి ఎక్కడంటే..
తాజాగా బీహార్‌లోని దర్భంగాలో క్యాన్సర్ చివరి దశలో ఉన్న వృద్ధురాలి ఓటు కోసం స్ట్రెచర్‌పై ఓటింగ్ బూత్‌కు వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఆమె తన జీవితపు చివరి ఘడియలను లెక్కిస్తున్న సమయంలో కూడా.. ఓటు వేయడానికి వచ్చి తన బాధ్యతను నిర్వర్తించింది. అయితే వృద్ధురాలు శుభద్రాదేవి. ఈమె దర్భంగా జిల్లాలోని విషన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌగ్మా గ్రామంలో నివాసం ఉంటుంది. అయితే క్యాన్సర్ తో బాధపడుతున్న శుభద్ర దేవికి తనకు ఓటు ఉందని తెలిసింది. దీంతో తన ఓటు హక్కుని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే తనకు కూడా ఓటు వేయాలని తన కుమారుడు విజయ్ కుమార్ మిశ్రాకు చెప్పింది.
కానీ, అనారోగ్యంగా ఉన్న నువ్వు.. ఎన్నికల బూత్‌కు ఎలా వెళ్తావు? అని కొడుకు ప్రశ్నించాడు. అయితే అప్పుడు తన కొడుకుతో నేను నా బాధ్యతను నేను నిర్వర్తించాలనుకుంటున్నాను అని శుభద్రాదేవి చెప్పడంతో.. తల్లి కోరికతో ఏకీభవించిన కొడుకు తల్లిని పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకుని వెళ్ళాలని భావించాడు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ తల్లికి స్ట్రెచర్ ఆర్డర్ ఇచ్చాడు. అనంతరం కారులో విష్ణుయార్ చౌగ్మా మిడిల్ స్కూల్ బూత్ నంబర్ 116కి తీసుకెళ్లాడు. కాగా, ఎంతో ఉత్సాహంతో శుభద్రాదేవి ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చింది. అయితే బూత్ దగ్గర నిలబడి ఉన్న ప్రజలందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. మరి, చావు బ్రతుకల స్థితిలో ఉన్నా వృద్ధురాలు ఓటు వేసి తన బాధ్యతను నిర్వార్తించుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.