P Venkatesh
Aadhar Update: ఆధార్ కార్డ్ కలిగి ఉన్నవారికి బిగ్ అలర్ట్. మీరు ఇంకా ఈ పని చేయకపోతే వెంటనే చేయండి. లేదంటే నష్టపోతారు. ఇంతకీ ఏం చేయాలంటే.
Aadhar Update: ఆధార్ కార్డ్ కలిగి ఉన్నవారికి బిగ్ అలర్ట్. మీరు ఇంకా ఈ పని చేయకపోతే వెంటనే చేయండి. లేదంటే నష్టపోతారు. ఇంతకీ ఏం చేయాలంటే.
P Venkatesh
దేశంలోని ప్రతి పౌరుడికి గుర్తింపు కార్డును జారీ చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను ప్రవేశపెట్టింది. ఇది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. ఆధార్ కార్డులతో ప్రజలు పలు ప్రయోజనాలను పొందుతున్నారు. ఆధార్ కార్డుపై ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, అడ్రస్, వయసు వంటి వివరాలు ఉంటాయి. గుర్తింపు ధృవీకరణ పత్రంగా, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందాలన్నా.. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మారింది. బ్యాంక్ అకౌంట్ తెరవడానికి, సిమ్ కార్డు కొనడానికి, ఆస్తులు, వాహనాల కొనుగోలు చేయడానికి ఆధార్ కార్డులు కీలకంగా మారాయి. కాగా కొంత కాలం నుంచి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉచితంగానే ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నది. 10 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోని వారు త్వరగా చేసుకోవాలని గడువు విధించింది. నేటితో ఆ గడువు ముగియనున్నది. మీరు ఆధార్ కార్డ్ ఇంకా అప్ డేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లేదంటే నష్టపోతారు.
యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించారు. ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ అని ఉడాయ్ ప్రకటించింది. సెప్టెంబర్ 14 తర్వాత మార్పులు చేసుకోవాలంటే రూ.50 జరిమానా చెల్లించాలని తెలిపింది. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్స్, ఫేస్ వంటి బయో మెట్రిక్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోలేరని తెలిపింది. ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. ఉచిత సేవలు ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. గడువు ముగిసిన తర్వాత అప్ డేట్ చేసుకుంటే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.