Kolkata Doctor Incident-Victim Father Comments: కోల్‌కతా డాక్టర్ డైరీ లో ఒక్క పేజీ మిస్! తండ్రి సంచలన నిజాలు!

Kolkata: కోల్‌కతా డాక్టర్ డైరీ లో ఒక్క పేజీ మిస్! తండ్రి సంచలన నిజాలు!

Kolkata Doctor Incident: కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యాచార ఘటనపై స్పందిస్తూ.. బాధితురాలి తండ్రి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..

Kolkata Doctor Incident: కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యాచార ఘటనపై స్పందిస్తూ.. బాధితురాలి తండ్రి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో విధి నిర్వహణలో ఉన్న జూనియర్‌ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిపి అంతమొందించిన దారుణ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ సంఘటన మరో నిర్భయను తలపిస్తోంది అంటున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం, నిరసన జ్వాలలు పెల్లుబికుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా.. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఒక్కరోజు వైద్య సేవలు నిలిపివేసింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఈ హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఇదిలా ఉండగా.. బాధితురాలి పోస్ట్‌మార్టం నివేదికలో దారుణానికి సంబంధించి భయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో ఇది ఒక్క వ్యక్తి చేసిన దారుణం కాదు.. సామూహిక హత్యాచారం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా బాధితురాలి తండ్రి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..

బాధితురాలి తండ్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరు చూసి తమకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందన్నాడు. కనీసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అయినా వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తోందని మృతి చెందిన వైద్యురాలి తండ్రి చెప్పుకొచ్చాడు. అంతేకాక తన కుమార్తె రాసుకున్న డైరీని సీబీఐ అధికారులకు అందజేశానన్న ఆయన.. అందులోని అంశాలను మాత్రం వెల్లడించడానికి నిరాకరించాడు. పైగా డైరీలో ఒక చిరిగిన పిక్చర్‌ ఉండటాన్ని గమనించాను అని చెప్పుకొచ్చాడు. కానీ దాని గురించిన పూర్తి సమాచారం ఆయన వెల్లడించలేదు.

తన బిడ్డను ప్రజా సేవ కోసం పంపిస్తే.. అక్కడున్న వారు మాత్రం ఆమెని కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని.. బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. పైగా ఈ దారుణం చేసింది ఒక్కడే కాదు.. సామూహిక హత్యాచారం జరిగిందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురించి ఎంబీబీఎస్ వైద్యులు సహా తాము కలిసి మాట్లాడినవారంతా ఒక్కరి వల్ల ఇంతటి ఘోరం జరగదని అన్నారని.. చెప్పుకొచ్చాడు. ఇక బాధితురాలి తండ్రి మాటలతో.. ఈ దారుణం సామూహిక హత్యాచారం అనే అనుమానానికి బలం చేకూరుతుంది.

ఇక ఆగస్టు 8న రాత్రి డ్యూటీలో ఉన్న ట్రెయినీ వైద్యురాలు.. సెమినార్ హాల్‌లో నిద్రపోతున్న సమయంలో అత్యాచారానికి పాల్పడిన హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెపై శరీరంపై అనేక గాయాలున్నట్టు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడయ్యిందనే ప్రచారం జరిగింది. అయితే దీనిని పోలీసులు తోసిపుచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి పక్కనే అతడి బ్లూటూత్ సెట్ లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నారు.

Show comments