Dharani
Kolkata Doctor Incident-Vandalism RG Kar Hospital: కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
Kolkata Doctor Incident-Vandalism RG Kar Hospital: కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
Dharani
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై చోటు చేసుకున్న హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో వైద్యురాలిని తీవ్రంగా గాయపరిచాడని.. ఆమె కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయ్యిందని.. ముఖం, గోళ్లపై గాయాలయ్యాయని తెలిపారు. ఆమె ప్రైవేటు అవయవం నుంచి కూడా బ్లీడింగ్ అయినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని.. మొదట హత్య చేసి తరువాత అత్యాచారం చేశాడని అంచనా వేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తూ పూర్తి వివరాలు తెలుస్తాయి అంటున్నారు. ఇక తాజాగా వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రిలో విధ్వంసం చోటు చేసుకుంది. ఆ వివరాలు.
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఘటనపై మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఘటనపై నిరసన తెలుపుతూ.. బుధవారం అర్ధరాత్రి 11.55 గంటలకు ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం’ పేరుతో మహిళలు ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో ఆర్జీ కార్ హాస్పిటల్‌పై దాడి చేశారు. ఘటనలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రిలో చొరబడానికి ప్రయత్నం చేశారని.. అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఆందోళనకారులు.. రెండు పోలీస్ వాహనాలు, ఓ బైక్‌కు నిప్పంటించారు. బారికేడ్లను తోసుకుంటూ దూసుకొచ్చిన ఆందోళనకారులు.. వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. వీధుల్లోనూ పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పోలీసులు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు.