Arjun Suravaram
భారతీయులు బుల్లెట్ ట్రైన్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలి బుల్లెట్ రైలు గురించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. భారత్ లో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు పరుగులు పెట్టనుందనే వివరాలను వెల్లడించింది.
భారతీయులు బుల్లెట్ ట్రైన్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలి బుల్లెట్ రైలు గురించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. భారత్ లో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు పరుగులు పెట్టనుందనే వివరాలను వెల్లడించింది.
Arjun Suravaram
మన దేశంలో ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద వ్యవస్థల్లో రైల్వే శాఖ ఒకటి. రైళ్ల ద్వారా నిత్యం లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. సుఖవంతమైన ప్రయాణంతో పాటు టికెట్ ధర తక్కువగా ఉండటంతో వీటిల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. రైళ్లు ప్రారంభమైన నాటి నుంచి నేటికి అనేక మార్పులు సంభవించాయి. పొగబండి నుంచి అత్యాధునికి వందే భారత్ రైళ్ల వరకు అనేక రకాల రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమీప భవిష్యత్ లో బుల్లెట్ రైళ్లు మన ఇండియాలో కూడా పరుగులు తీయనున్నాయి. తాజాగా ఈ బుల్లెట్ ట్రైన్స్ గురించి కేంద్రం కీలక అప్ డేట్ ను ఇచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బుల్లెట్ ట్రైన్.. ఆర్థికంగా అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఈ ట్రైన్లు ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ బుల్లెట ట్రైన్ ను నడిపేందుకు చాలా ప్రణాళిక ఉండాలి. ఇప్పటికే వందే భారత్ వంటి స్పీడ్ రైళ్లను ప్రవేశ పెట్టిన భారత్ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్స్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్ రైలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియజేశారు. అది కూడా ఏ మార్గంలో దేశంలోనే ఈ తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుందనే విషయాలను కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు.
మంగళవారం రైజింగ్ భారత్ సమ్మిట్ జరిగింది. ఇందులో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ ప్రభుత్వం రైల్వే రంగంలో తీసుకొచ్చిన సంస్కరణ గురించి వివరించారు. ఇదే సమయంలో బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన రాగా..దానిపై కూడా మంత్రి కీలక విషయాలను వెల్లడించారు. 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. గుజారాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై మధ్య తొలి బుల్లెట్ రైలు నడవనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే అహ్మదాబాద్ – ముంబై మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం జరుగుతోందని ఆయన వెల్లడించారు.
ఇక ఈ ముంబై, అహ్మదాబాద్ మధ్య కారిడార్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. ముంబై-అహ్మదాబాద్ మధ్య 508.17 కిలోమీటర్ల దూరంతో ఈ హై స్పీడ్ రైలు కారిడార్ ను నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. జపాన్ షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ కారిడార్ లో హై స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని కేంద్రం భావించినప్పటికీ పలు కారణాలతో ఆలస్యం అయింది. 2026 నాటికి దక్షిణ గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య తొలి దశ బుల్లెట్ రైలును నడపాలని కేంద్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి..బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రి ఇచ్చిన సమాచారంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.