iDreamPost
android-app
ios-app

భారీ వర్షాల నేపథ్యంలో రేపు అక్కడి విద్యా సంస్థలకు సెలవు!

Kerala Government Announced Holiday For Schools: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

Kerala Government Announced Holiday For Schools: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

భారీ వర్షాల నేపథ్యంలో రేపు అక్కడి విద్యా సంస్థలకు సెలవు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణకు అయితే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్టులు కూడా జారీ చేస్తున్నారు. ఇలాగే అటు కేరళ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు ప్రజలను కంగారు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం కేరళ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కన్నూర్, కాసరగోడ్, ఉత్తర మల్లప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే త్రిశూర్, వయనాడ్, ఇడుక్కీ, కోజీకోడ్, ఎర్నాకులం, పల్కాడ్, జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కేరళ రాష్ట్రంలో రెండ్రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అలాగే కొట్టాయంలో ఉదయం నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలకు చెట్లు, వృక్షాలు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. అలాగే ఈ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తున్నాయ. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వరద నీరు చేరుతున్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. రేపు వర్షాల ఉద్ధృతి మరింత అధికంగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే ఈదురు గాలులు కూడా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందంట. అందుకే ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యే ప్రమాదం ఉందని విపత్తలు శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా.. విద్యుత్ సరఫరాకి కూడా అంతరాయం ఏర్పడుతోంది. భారీ వృక్షాలు విరిగిపడుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మూడ్రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు బాగానే కురుస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.