iDreamPost
android-app
ios-app

‘మీరు బతికే ఉన్నారా?’ అయితే EMI కట్టండి.. కేరళలో వింత పరిస్థితి!

Kerala Floods Wayanad 2024- Complaint Against Private Money Lenders: కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి స్థానికులు విలవిల్లాడిపోతున్నారు. ఇంకా అక్కడ సాధారణ పరిస్థితి నెలకొనలేదు. ఇలాంటి తరుణంలో ప్రైవేట్ లోన్ సంస్థలు బతిక్కున్న వారిని ఈఎంఐల కోసం వేధిస్తున్నాయంట.

Kerala Floods Wayanad 2024- Complaint Against Private Money Lenders: కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి స్థానికులు విలవిల్లాడిపోతున్నారు. ఇంకా అక్కడ సాధారణ పరిస్థితి నెలకొనలేదు. ఇలాంటి తరుణంలో ప్రైవేట్ లోన్ సంస్థలు బతిక్కున్న వారిని ఈఎంఐల కోసం వేధిస్తున్నాయంట.

‘మీరు బతికే ఉన్నారా?’ అయితే EMI కట్టండి.. కేరళలో వింత పరిస్థితి!

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ప్రకృతి సృష్టించిన విలయతాండవానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 370 మంది మరణించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు.. ఇలా అందరూ సాహాయక చర్యల్లో భాగమయ్యారు. స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వారికి సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ ఘటన నంచి ప్రాణాలతో బయటపడిన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ఆ పునరావాస కేంద్రాల్లో ఒక వింత పరిస్థితి నెలకొంది. సర్వం కోల్పోయి.. అయిన వాళ్లను దూరం చేసుకుని ప్రాణాలతో బయటపడి బిక్కు బిక్కు మంటూ బతుకుతున్న వారికి కొందరు లోన్లు ఇచ్చిన వాళ్లు ఫోన్ చేసి ఈఎంఐలు కట్టమని వేధిస్తున్నారంట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

వయనాడ్ జిల్లాని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకు ఎందరో కష్టపడుతున్నారు. అలాగే అక్కడి ప్రజలు తిరిగి మాములు అయ్యేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, ప్రముఖలు, సినిమా హీరోలు విరాళాలు ఇస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ ప్రళయంలో నష్టపోయిన వారిని పునారవాస కేంద్రాలకు చేర్చి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పునరావాస కేంద్రాల్లో ఒక వింత పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. కొందరు ప్రైవేటుగా లోన్స్ ఇచ్చేవాళ్లు వరదల్లో నష్టపోయిన వారికి ఫోన్ చేస్తున్నారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే అది వారి మీద ప్రేమ అనుకుంటే పొరపాటే అవుతుంది. పెండింగ్ ఈఎంఐ కట్టమని అడుగుతున్నారంట.

Wayanad

ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిన కథనం ప్రకారం.. “నేను ఒక లోన్ తీసుకున్నాను. వాళ్లు నాకు ఫోన్ చేశారు. ముందుగా మీరు బాగానే ఉన్నారా అని అడిగారు. నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. అవునా.. అయితే ఎలాగోలా మీ పెండింగ్ ఈఎంఐ కట్టండి. ఒకవేళ కట్టకపోతే మీ చెక్ బౌన్స్ అవుతుందని బెదిరిస్తున్నారు. ఇప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను. ఆ లోన్ ఎప్పుడైనా కట్టచ్చు. ఎవరూ కూడా ఫోన్ చేసి తిన్నావా అని అడగలేదు. కానీ, ఇప్పుడు ఫోన్ చేసి లోన్ కట్టమంటున్నారు. ఇల్లు, బంధువులను కోల్పోయి ఇంత బాధలో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి అడగాల్సిన ప్రశ్న ఇదేనా?” అంటూ ఆ వ్యక్తి ప్రశ్నించాడు. కొన్ని ప్రైవేటు లోన్ సంస్థలు ఇలాంటి ఫోన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫిర్యాదు విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన వారిని ఇలా ఈఎంఐల కోసం బెదిరించడం అస్సలు కరెక్ట్ కాదు అంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.