ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దంటూ.. ఎన్ని సార్లు చెప్పినా గానీ.. కొంత మంది చెవికి ఎక్కించుకోరు. పైగా నా ఇష్టం అన్నట్లుగా వారు వాహనాలను నడుపుతూ.. ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఇక మందు బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాగి వాహనాలు నడుపుతూ.. ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ పై కారు నడిపి అందరిని షాక్ కు గురిచేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జయప్రకాశన్(48) కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. జులై 18న రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు. అనంతరం తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలనే మార్గం మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చాడు. అయితే మద్యం మత్తులో ఉన్న అతడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యాడు. రైల్వే ట్రాక్ ను షార్ట్ కట్ దారి అనుకుని కారును ట్రాక్ పైకి పోనిచ్చాడు. అలాగే కొంత దూరం కారును నడిపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు పట్టాలపై ఇరుక్కుపోయింది. ఇది గమనించిన రైల్వే గేట్ కీపర్, ఇతర వాహనదారులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు, సమీప రైల్వే స్టేషన్ కు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న అతడిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. అతడు మద్యం మత్తులో ట్రాక్ ను రోడ్డుగా పొరపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ సమయంలో అటుగా రైళ్లు రాకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ తతంగాన్ని అంతా అక్కడ ఉన్న వారు తమ ఫోన్ లలో వీడియో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి రైల్వే ట్రాక్ పై కారును నడిపిన ఈ ప్రబుద్ధుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
താഴെചൊവ്വയിൽ കാർ റെയിൽവേ ട്രാക്കിൽ കയറി pic.twitter.com/oQi9W9L6Xn
— Ramith :: My :: india.🇮🇳🇮🇳 (@Ramith18) July 20, 2023
ఇదికూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. రోడ్లపై చక్కర్లు కొడుతున్న మొసళ్లు!