iDreamPost

వర్షాల ఎఫెక్ట్‌.. రోడ్లపై చక్కర్లు కొడుతున్న మొసళ్లు!

వర్షాల ఎఫెక్ట్‌.. రోడ్లపై చక్కర్లు కొడుతున్న మొసళ్లు!

ఓ వైపు భారీ వర్షాలు.. మరో వైపు భూకంపాలు.. వరుస ప్రకృతి విపత్తులతో రాజస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఈ నేపథ్యంలో దెబ్బ మీద దెబ్బ అంటూ మరో ప్రమాదం వచ్చి పడింది. వర్షాల కారణంగా నదుల్లోంచి పెద్ద సంఖ్యలో మొసళ్లు జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు ఓ మొసలి రాత్రి పూట రోడ్డు దాటుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన రాజస్తాన్‌లోని కోటలో వెలుగు చూసింది.

ఓ మూడున్నర అడుగుల ఓ మొసలి రోడ్డు దాటుతూ ఉంది. రోడ్డుపై వెళుతున్న వాహనాలు ఆ మొసలిని చూసి ఆగిపోయాయి. చుట్టు పక్కలి జనం కూడా దాన్ని చూసి భయంతో ఆగిపోయారు. అది మొల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందున్న కాల్వలోకి దిగింది. ఇక, ఈ వీడియోను మంగళవారం రాత్రి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ వర్షాలు, భూకంపాలతోటి చస్తుంటే.. ఇప్పుడు మొసళ్లు కూడానా’’.. ‘‘ కొంచెం ఏమర పాటుగా ఉన్నా ఆ మొసలి చేతిలో ప్రాణాలు పోతాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, శుక్రవారం తెల్లవారుజామున జైపూర్‌ ప్రజలను భూకంపం భయపెట్టింది. మూడు సార్లు భూమి కంపించింది. దీంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మొదటి భూకంపం తెల్లవారుజామున 4:09 నిమిషాలకు ..రెండో భూకంపం 4:22 కి.. చివరిది 4. 25 నిమిషాలకు వచ్చింది. ఈ భూకంపం కారణంగా ప్రజలెవ్వరికీ ఎలాంటి నష్టం కలగలేదు. మరి, రాజస్తాన్‌ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వరుస పకృతి విపత్తులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి