iDreamPost
android-app
ios-app

కేరళ కోర్టు సంచలన తీర్పు 15 మందికి ఒకేసారి ఉరిశిక్ష

  • Published Jan 30, 2024 | 3:19 PM Updated Updated Jan 30, 2024 | 3:19 PM

గత రెండేళ్ల క్రితం కేరళలో జరిగిన బీజేపీ నేత హత్య కేసులో 15 మంది దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా కేరళ కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. అదేమిటంటే..

గత రెండేళ్ల క్రితం కేరళలో జరిగిన బీజేపీ నేత హత్య కేసులో 15 మంది దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా కేరళ కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. అదేమిటంటే..

  • Published Jan 30, 2024 | 3:19 PMUpdated Jan 30, 2024 | 3:19 PM
కేరళ కోర్టు సంచలన తీర్పు 15 మందికి ఒకేసారి ఉరిశిక్ష

గత రెండేళ్ల క్రితం కేరళలో జరిగిన బీజేపీ నేత హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన 2021 డిసెంబర్ 19న జరిగింది. ఇందులో అలప్పుళలోని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కర్యాదర్శి రంజిత్ శ్రీనివాస్ ను కొందరు క్రూరంగా హత్య చేశారు. కాగా, ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు పీఎఫ్ఐ ఎస్ బీపీఐ చెందిన కార్యకర్తలు కావడం గమన్హరం. ఈ నేరస్తులంతా రంజిత్ ఇంట్లోకి చొరబడి.. అతని కుటుంబ సభ్యుల ముందే అత్యంత దారుణంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన రంజీత్ ఈ దాడిలో మరణించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కొందర్ని అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు.. ఇటీవలే ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది. అయితే తాజాగా ఈ కేసులో దోషులుగా తేలిన 15మందికి శిక్ష విధిస్తూ కేరళ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ నేరస్తులకు సంబంధించి అలప్పుజ కోర్టు కొత్త తీర్పును వెల్లడించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో సంబంధించిన నేరస్తులకు కఠినంగా శిక్షించాలనే ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ వాదానను పరిగణనలోకి తీసుకున్నకేరళ సెషన్స్ కోర్టు మంగళవారం ఉదయం సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించిన అలప్పుజ న్యాయస్థానం.. వీరికి ఉరిశిక్ష విధించింది. అయితే దోషులంతా నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థకు చెందిన కార్యకర్తలు కావడం విశేషం.

అయితే రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసును దర్యాప్తు చేసిన కేరళ పోలీసులు.. పక్కా అధారాలను సేకరించారు. ఇక ఈ ఆధారలతోనే నిందితులను దోషులగా నిర్దారించిన మావెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి వారికి ఉరిశిక్షను ఖరారు చేశారు. కాగా, నేరస్తులంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని, వారు బాధితుడ్ని తల్లి, భార్య, కుమారుడి కళ్లముందే అత్యంత క్రూరంగా చంపేశారని వాదనలో రుజువైంది. మరి, బీజేపీ నేత హత్య కేసులో కేరళ కోర్టు విధించిన ఉరిశిక్ష పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.