Kerala Name: కేరళ పేరు మారుస్తూ సీఎం పినరయి కీలక నిర్ణయం.. కొత్త పేరు ఇదే!

కేరళ పేరు మారుస్తూ సీఎం పినరయి కీలక నిర్ణయం.. కొత్త పేరు ఇదే!

Kerala Name: దక్షిణ భారత దేశంలో కీలకమైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. అలాంటి ఈ రాష్ట్రం పేరు విషయంలో సీఎం పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రం పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పేరు ఏమిటంటే..

Kerala Name: దక్షిణ భారత దేశంలో కీలకమైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. అలాంటి ఈ రాష్ట్రం పేరు విషయంలో సీఎం పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రం పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పేరు ఏమిటంటే..

రాష్ట్రాల, దేశాలకు, అలానే పలు ప్రాంతాలకు పేర్లు మారడం అనేది సర్వ సాధారణం. ఇప్పటికే మన దేశంలోని పలు రాష్ట్రాలు, పలు ప్రాంతాలకు పేరు మార్చిన సంగతి అందరికి తెలిసింది. తాజాగా తివ్రేడం, లక్నో, బాంబే, మద్రాసు, కోల్ కత్తా వంటి నగరలా పేర్లు మార్పులు జరిగాయి. అలానే ఒరిస్సా, అస్సాం వంటి మరికొన్ని రాష్ట్రాల పేరులు కూడా మారినాయి. అయితే ఆయా ప్రాంతాల చరిత్రకు అనుగుణంగా, అక్కడి ప్రభుత్వాలు..పేర్లను మారుస్తుంటాయి. తాజాగా కేరళ సీఎం పినరయి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రం పేరు మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. మరి..కొత్త పేరు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కేరళ రాష్ట్రానికి కొత్త పేరును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం బిల్లు ప్రవేశపెట్టారు. విజయన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయితే విపక్షాలకు చెందిన కొందరు కొన్ని సవరణలను మాత్రం ప్రతిపాదించాయి. గతంలో కూడా కాగా, కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి.. కేంద్రానికి పంపింది. కానీ, ఆ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. దీంతో మళ్లీ కొత్తగా తీర్మానం చేసింది విజయన్ సర్కార్.

ఇలా ఏదైనా రాష్ట్రం పేరు మార్చాలంటే.. రాజ్యాంగ బద్ధంగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉండాలి. అలా ఆమోదం పొందిన తరువాత రాజ్యాంగంలోనే పేరును మార్చాల్సి ఉంటుంది. ఇలా తమ రాష్ట్రాల పేర్లను మారుస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి.. దానిని కేంద్రానికి పంపవచ్చు. అయితే మార్చాలా వద్దా అనే అంశం మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల పేర్లను మారుస్తూ కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక తాజాగా కేరళ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానంపై సీఎం పినరయి విజయన్‌ కొన్ని విషయాలను ప్రస్తావించారు.

గతంలోని తీర్మానం ప్రకారం రాజ్యాంగంలోని 1వ, 8వ షెడ్యూల్‌లో పేరు మార్చాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ‘కేరళం’ అనే పేరు మలయాళమని, రాజ్యాంగంలో రాష్ట్రం పేరు కేరళగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. కేరళ పేరు కేరళంగా మారుస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్‌లోని అన్ని భాషల్లోనూ ‘కేరళం’ అని రాయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. మరి..వీరి తీర్మానానికి కేంద్రం ఆమోదం తెలుపుతుందా..లేదా అలానే తన వద్ద ఉంచుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Show comments