చరిత్రలో మొదటిసారిగా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వరకు గోమాత పాదయాత్ర! ఎందుకో తెలుసా?

Gau Raksha Maha Padayatra: గోవులన్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి గోమాతను రక్షించుకోవడానికి భారత గోసేవా ఫౌండేషన్ సంస్థ గోమాత మహాపాద యాత్ర చేపట్టింది.

Gau Raksha Maha Padayatra: గోవులన్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి గోమాతను రక్షించుకోవడానికి భారత గోసేవా ఫౌండేషన్ సంస్థ గోమాత మహాపాద యాత్ర చేపట్టింది.

దేశంలో ఇప్పటి వరకు ఎంతోమంది యాత్రలు దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి మొదలు పెట్టి కాశ్మీర్ వరకు కొనసాగించారు. ఇప్పుడు గోమాత మహాయాత్ర కాశ్మీర్ లో మొదలు పెట్టింది. చరిత్రలో గోమాత ఇలా పాదయాత్ర చేయడం మొదటిసారి అంటున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని న్యూ ఢిల్లీకి చేరుకున్న గోమాత పాదయాత్ర పలు రాష్ట్రాల గుండా సాగి మార్చి నెలాఖరు నాటికి కన్యాకుమారి చేరుకోనుంది. ఒకప్పుడు ధర్మ పరిరక్షణ, మత సామరస్యం కోసం ఆదిశంకరాచార్యులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని చరిత్ర చెబుతుంది.  ఇంతకీ గోమాత పాద యాత్ర ఎందుకు చేపట్టినట్లు అన్న విషయం గురించి తెలుసుకుందాం.  పూర్తి వివరాల్లోకి వెళితే..

గోమాత మహా పాదయాత్ర హిందూ జీవనం విధానంలో ప్రాధాన్యత, ప్రాశస్త్యం కలిగి ‘గోవు’ ను పరిరక్షించుకోవాలన్న సందేశంతో కొనసాగుతుంది.  ఇప్పటి వరకు ఎంతోమంది మహానుభావులు పలు సందేశాల కోసం భారత దేశంలో విస్తృతంగా పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు చేస్తున్నారు.కొన్ని రాజకీయల కోసం అయితే మరికొన్ని ధర్మ పరిరక్షణ కోసం.. సమాజంలో నెలకొన్ని అన్యాయాలు, అక్రమాలు వెలుగెత్తి చాటడం కోసం. గోమాత లో సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది.ఇప్పటి వరకు మనుషులు పాదయాత్ర చేస్తే.. చరిత్రలో మొదటిసారిగా గోమాత ఈ సాహసం చేపట్టింది.

గోమాత మహాపాద యాత్ర చేయడం గొప్ప విషయం అని బీజేపీ అగ్రనేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ సంస్థ చేపట్టిన ఈ పాదయాత్ర మొత్తం 14 రాష్ట్రా మీదుగా దాదాపు 4,900 కిలో మీటర మేర సాగి చివరికి కన్యాకుమారిలో ముగియనుందని అంటున్నారు. సెప్టెంబర్ 27న కాశ్మీర్ లో గోమాత మహాయాత్ర ప్రారంభమైన ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుంది. గోవుల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ మహత్కార్యం గురించి తెలుసుకున్న కేంద్ర హూంమంత్రి అమిత్ షా.. పాద యాత్ర చేస్తున్న బృందాన్ని ప్రత్యేకంగా కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

Show comments