P Krishna
Conspiracy to Bomb the Train: ఇటీవల సంఘ విద్రోహ శక్తులు ప్రయాణా సంస్థలను టార్గెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. రైల్వే, బస్, విమానాశ్రయాల్లో బంబులు అమర్చుతు విధ్వంసాలకు పాల్పపడుతున్నారు. అలాంటి ఘటనో ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Conspiracy to Bomb the Train: ఇటీవల సంఘ విద్రోహ శక్తులు ప్రయాణా సంస్థలను టార్గెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. రైల్వే, బస్, విమానాశ్రయాల్లో బంబులు అమర్చుతు విధ్వంసాలకు పాల్పపడుతున్నారు. అలాంటి ఘటనో ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
P Krishna
ప్రపంచంలో అతిపెద్ద వవాణా వ్యవస్థల్లో ఒకటి భారతీయ రైల్వే. ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైల్వే ప్రయాణికులకు ఎలాటి అసౌకర్యం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రైల్వే ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. సుధూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలునే ఎంచుకుంటారు. భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఇటీవల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. టెక్నికల్ ఇబ్బందులు కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని జరుగుతున్నాయి. తాజాగా కాలింది ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్‌లో రైలు ప్రమాదం తప్పింది. బర్రారాజ్ పూర్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ పై ఉంచిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ని కాళింది ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. అదృష్ట వశాత్తు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.ఈ ఘటనపై ఆర్పీఎఫ్ ఎఫ్ఆర్ఐ నమోదు చేసింది. కేసు దర్యాప్తును ఐబీకి అప్పగించారు. రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెలు ఉండటం అనేది ఖచ్చితంగా సంఘవిద్రోహుల పని అయి ఉంటుందని భావిస్తున్నారు. కావాలనే విధ్వంసానికి కుట్ర పన్నినట్లుగా తెలుస్తుందని అంటున్నారు అధికారులు.
ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని అధికారులు అంటున్నారు. గతంలో పలుమార్లు రైల్వే ట్రాక్ పై సున్నితమైన వస్తువులను ఉంచి రైలు బోల్తా కొంటిచే ప్రయత్నాలు చేశారని తెలిపారు. అయితే ముందుగానే వాటిని పసిగట్టి లోకో పైలట్ కి సిగ్నిల్ ఇవ్వడం ద్వారా పెను ప్రమాదాలను భగ్నం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కాళింది ఎక్స్‌ప్రెస్ మాకే వద్ద దాదాపు 22 నిమిషాలపాటు నిలిచిపోయిందని అన్నారు. ట్రాక్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత తిరిగి పంపించారు. కొన్నిరోజుల క్రితం సబర్మతి ఎక్స్ ప్రెస్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో రైలు లోని 22 బోగీలు బోల్తా పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు ఐబీ దర్యాప్తు చేస్తుంది.