iDreamPost
android-app
ios-app

దారుణం: కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని ఉద్యోగిని కొట్టి చంపిన గ్రామస్తులు!

  • Published Aug 07, 2023 | 8:43 PM Updated Updated Aug 07, 2023 | 8:43 PM
  • Published Aug 07, 2023 | 8:43 PMUpdated Aug 07, 2023 | 8:43 PM
దారుణం: కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని ఉద్యోగిని కొట్టి చంపిన గ్రామస్తులు!

మనం నెల మొత్తంలో వినియోగించే విద్యుత్ పై అధికారులు ప్రతీ నెల ఇంటికి వచ్చి కరెంట్ బిల్ ఇచ్చి వెళ్తుంటారు. ఒకవేళ ఏదైన నెలలో కరెంట్ బిల్ ఎక్కువగా వస్తే మాత్రం ఇంటి సభ్యులు ఆ విద్యుత్ అధికారిని అక్కడే నిలదీస్తుంటారు. కానీ, ఓ రాష్ట్రంలో మాత్రం కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని కొందరు గ్రామస్తులు ఆ ఉద్యోగిని అతి దారుణంగా హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లాలోని గ్యాలరీ గ్రామంలో లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను స్థానికంగా విద్యుత్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అయితే లక్ష్మీ నారాయణ్ కరెంట్ మీటర్ల రీడింగ్ కోసం తాజాగా కుపాటి అనే గ్రామానికి వెళ్లాడు. కాగా, కొందరు గ్రామస్తులు.. కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చిందని అతడితో వాగ్వాదానికి దిగారు. ఇంతే కాకుండా గ్రామస్తులు కలిసి అతడిపై దాడికి దిగారు. దీంతో లక్ష్మీ నారాయణ్ భయపడి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే కొందరు గ్రామస్తులు పదునైన ఆయుధాలతో అతడిని పరుగెత్తించి పరుగెత్తించి దాడి చేశారు. దీంతో లక్ష్మీ నారాయణ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే లక్ష్మీ నారాయణ్ మరణవార్త తెలియగానే మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని విద్యుత్ ఉద్యోగిని హత్య చేసిన గ్రామస్తుల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: మద్యం మత్తులో యువకుడి బరితెగింంపు.. మహిళ ఒంటరిగా ఉందని..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom