iDreamPost
android-app
ios-app

ఒకే రోజు 3 రోల్స్‌ రాయిస్‌ కార్లు కొన్న కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ ఓనర్‌! గోల్డ్‌ బిజినెస్‌లో ఇంత లాభమా?

  • Published Mar 23, 2024 | 11:37 AM Updated Updated Mar 23, 2024 | 11:37 AM

దేశంలో చాలామంది వ్యాపరవేత్తలు, ప్రుముఖులు ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగొలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేరళకు చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ఒకెే రోజు అన్ని కోట్ల విలువ చేసిన 3 కార్లను కొనుగోలు చేసి రికార్డులను సృష్టించారు.

దేశంలో చాలామంది వ్యాపరవేత్తలు, ప్రుముఖులు ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగొలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేరళకు చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ఒకెే రోజు అన్ని కోట్ల విలువ చేసిన 3 కార్లను కొనుగోలు చేసి రికార్డులను సృష్టించారు.

  • Published Mar 23, 2024 | 11:37 AMUpdated Mar 23, 2024 | 11:37 AM
ఒకే రోజు 3 రోల్స్‌ రాయిస్‌ కార్లు కొన్న కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ ఓనర్‌! గోల్డ్‌ బిజినెస్‌లో ఇంత లాభమా?

దేశంలో చాలామంది వ్యాపరవేత్తలు, ప్రుముఖులు ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగొలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరచుతారు. ఎందుకంటే..వారికి కొత్తగా మార్కెట్ లో లాంఛ్ చేసిన వేరైటి మోడల్ కంపెన్సీకు చెందిన కార్లను కొనుగోలు చేసి ట్రెండీగా ఉండాలని అభిప్రాయ పడతారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త కంపెనీ కార్ల జాబితాను తెలుసుకొని, కోట్ల రూపాయాలు పెట్టి వాటిని కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా వాటికి నంబర్ ప్లేట కోసం కూడా ప్రత్యేకంగా కోట్ల రూపాయాలు ఖర్చు చేసే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ, ఒకరోజు దాదాపు అన్ని కోట్ల విలువ చేసే కార్లను ఏకంగా 3 కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు ఓ వ్యక్తి. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకి ఆయన ఎవరంటే..

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారవేత్త.. కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత TS ‘కళ్యాణరామన్’ గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా కళ్యాణ్ గ్రూప్ యజమాని టిస్ కళ్యాణరామన్.. ఒకే రోజులో 3 రోల్స్ రాయిస్ కల్లినన్ SUV కార్లను కొనుగోలు చేసి రికార్డులను సృష్టించారు. ఎందుకంటే.. వాటి ధర దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.ఇక కేరళకు చెందిన టీఎస్ కళ్యాణరామన్.. ఒక రోజున ఇంత విలువగల రోల్స్ రాయిస్ కల్లినన్ కార్లను డెలివరీ పొందిన వీడియో అనేది ప్రస్తుతం వైరల్ గా మారింది. పైగా కేరళలో ఇంత ఖరీదైన కార్లను ఏకంగా ఒకేసారి కొనుగోలు చేసిన ఘనత కల్యాణరామన్‌కు దక్కింది. అంతేకాకుండా.. కేరళలో బ్లాక్ బ్యాడ్జ్ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి కూడా ఇతనే. అయితే కళ్యాణరామన్.. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ తో పాటు మరో రెండు సాధారణ కులినన్ కార్లను కొనుగోలు చేశారు. కాగా, ఈ మూడు కార్లు ఎక్స్-షోరూమ్ ధర రూ.25 కోట్లు ఉంటుంది.

ఇప్పటికే కళ్యాణరామన్ కార్ కలెక్షన్‌లో అనేక విలాసవంతమైన ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా, అందులో దాదాపు అన్ని లగ్జరీ బ్రాండ్ల కార్లు కావడం విశేషం. ఇక కళ్యాణరామన్‌కు రోల్స్ రాయిస్ బ్రాండ్ కారు కొత్త కాదు, ఎందుకంటే.. అతని దగ్గర ఇప్పటికే రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ 1 అండ్ ఫాంటమ్ సిరీస్ 2 తో మొత్తం 3 కార్లు ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఈ 3 కార్లు వచ్చి చేరాయి. ఇవి కాకుండా.. ఆయనకు ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. కాగా, ఆ జెట్ ను ఎంబ్రేయర్ లెగసీ 650 పేరుతో రూ.178 కోట్లకు కొనుగోలు చేశారు. దీనితో పాటు అతను బెల్ 427 హెలికాప్టర్ ను కూడా కొన్నాడు. ఇక ఈ హెలికాప్టర్ ధర రూ. 48 కోట్ల ఉంటుంది. ఇదిలా ఉంటే.. కళ్యాణరామన్ తన వ్యాపార సామ్రజ్యాన్ని 1993లో కళ్యాణ్ జ్యువెలర్స్ పేరుతో మొదట ఓ స్టోర్ ను ప్రారంభించారు. కానీ, ఇప్పుడు ఆ స్టోర్ అనేది దేశ విదేశాల్లో విస్తరించుకుపోయింది. దాదాపు ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాంచ్ లు 200 పైగా ఉన్నాయి.ఇక UAE, ఖతార్, కువైట్, ఒమన్ సహా విదేశాలలో 30కి పైగా బ్రాంచీలు ఉన్నాయి. మరి, ఒకరోజున 3 రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ కార్లను కొనుగోలు చేసిన కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత కళ్యాణరామన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.