Arjun Suravaram
టెలికాం రంగంలో జియోకి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు జియో తరచూ అనేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పటికే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జియో.. తాజాగా మరో శుభవార్త చెప్పింది.
టెలికాం రంగంలో జియోకి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు జియో తరచూ అనేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పటికే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జియో.. తాజాగా మరో శుభవార్త చెప్పింది.
Arjun Suravaram
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంది. మొబైల్ లేని వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. వీటిని వినియోగించే వారు అనేక రకాల రీచార్జులు చేయించుకుంటారు. తమకు అనుకూలంగా ఉండే ఆఫర్లను ఎంపిక చేసుకుంటారు. అలానే టెలికాం సంస్థలు కూడా తమ వినియోదారుల సంఖ్యను పెంచుకునేందుకు అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఇలాంటి విషయాల్లో రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా జియో ఇప్పుడు తన వినియోదారులకు మరో శుభవార్త అందించింది. ఆ గుడ్ న్యూస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
టెలికాం రంగంలో జియో సంస్థ క్రియేట్ చేసిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే కోట్లాడిది మంది కస్టమర్లను కూడగట్టుకున్న ఘనత జియోకే సొంతం. టెలికాం రంగంలో జియోకి ముందు, జియో తరువాత అనే అంతలా మార్పులు జరిగాయి. కోట్ల మంది కస్టమర్లను ఉన్న జియో తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతోంది. తాజాగా ఇప్పుడు తన వినియోదారులకు మరో శుభవార్త అందించింది. సంస్థ ఎప్పటికప్పుడు అనేక నియమాలను మారుస్తుంది.
జియో సంస్థ తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌లను తీసుకురావడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ ప్లాన్ ఐపీఎల్ సీజన్ 17 ను చూడాలనుకునే వారి కోసం తీసుకొచ్చారు. జియో ఐపిఎల్ 2024 అనే ఆఫర్ ను జియో సంస్థ తీసుకొచ్చింది. జియో ఈ ఐపీఎల్ సీజన్‌లో 50 రోజుల పాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్లాన్‌ను అందిస్తోంది. అయితే ఈ కొత్త ప్లాన్ జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్ల అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ జియో ట్రూ 5జీ మొబైల్ కనెక్షన్లకు అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు బిల్లింగ్ ప్లాన్‌ను కూడా మార్చుకునే అవకాశం ఉంది.
మీరు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ లేదా 12 నెలల ముందుగా చెల్లించినా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్లాన్ ను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ప్లాన్ తో 50 రోజుల ఉచిత వోచర్‌తో ఇంటి సేవను పొందవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాల్ చేసిన వారంలో ఈ వోచర్ క్రెడిట్ చేయబడుతుంది. వినియోదారులు 50 రోజుల తగ్గింపు వోచర్ ను సులభంగా పొందవచ్చు. రాబోయే బిల్లింగ్ సైకిల్ లో కూడా ఈ ఆఫర్ ను సర్ధుబాటు చేయవచ్చు. తగ్గింపు వోచర్ 2 ఏళ్ల పాటు వాలీడ్ అవుతోంది. ఈ ప్లాన్ మాత్రం 30 ఏప్రిల్ 2024 వరకు చెల్లుబాటు అవుతుంది. మరి..జియో సంస్థ తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.