Dharani
ఉపాధి కోసం వెళ్లిన కుమారుడు టన్నెల్లో చిక్కుకున్నాడని తెలిపి ఆ తండ్రి తీవ్రంగా ఆందోళణ చెందాడు. కొడుకు రాక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాడు. తీరా కొడుకు కళ్ల ముందుకు వచ్చే సమయానికి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఉపాధి కోసం వెళ్లిన కుమారుడు టన్నెల్లో చిక్కుకున్నాడని తెలిపి ఆ తండ్రి తీవ్రంగా ఆందోళణ చెందాడు. కొడుకు రాక కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాడు. తీరా కొడుకు కళ్ల ముందుకు వచ్చే సమయానికి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
Dharani
ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలు.. మంగళవారం నాడు సురక్షితంగా బయటకు వచ్చారు. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా బయటకు రావాలని.. వారి కుటుంబ సభ్యులతో పాటు.. దేశంలోని ప్రజలంతా కోరుకున్నారు. వారు సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థించారు. 17 రోజుల ఎదురు చూపులు, ప్రయత్నాల తర్వాత.. టన్నెల్లో ఉన్న వారంతా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. ఈ 17 రోజులను వారు జీవితాంతం మర్చిపోలేరు. కళ్లు పొడుచుకున్నా కానరాని చీకట్లో.. కన్నవాళ్లను తల్చుకుంటూ.. జీవితం మీద ఆయను కోల్పోయి.. సొరంగంలో బిక్కు బిక్కు మంటూ గడిపారు. దేవుడి దయ వల్ల.. అందరి ప్రార్థనలు ఫలించి వారు క్షేమంగా బయటకు వచ్చారు. రాగానే కన్నవాళ్లను, అయిన వాళ్లను హత్తుకుని తనివి తీర ఏడ్చారు.
అయితే ఓ యువకుడికి మాత్రం సొరంగం నుంచి క్షేమంగా బయటకు వచ్చిన సంతోషం ఎంతో సేపు నిలవలేదు. బయటకు రాగానే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. తన రాక కోసం ఎదురూ చూసిన కన్న తండ్రి.. తాను బయటకు వచ్చే సమయానికి కన్నుమూశాడని తెలిసి ఆ యువకుడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆ యువకుడి పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ వివరాలు..
ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నెల్లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్ లోని తూర్పు సింగ్భూమ్ జిల్లా దుమారియా బ్లాక్ కు చెందిన ఆరుగురు కూలీలు ఉండగా.. వారిలో 29 ఏళ్ల భక్తు ముర్ము ఒకడు. ఇక అతడి రాక కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. వారి నిరీక్షణలు ఫలించి.. ముర్ము బయటకు వచ్చాడు.
రాగానే తండ్రి కోసం అతడి కళ్లు వెదికాయి. ఎక్కడా కనిపించలేదు. దాంతో కుటుంబ సభ్యులను అడిగారు. అందుకు వారు ఏడుస్తూ తండ్రి చనిపోయాడని.. అది కూడా ముర్ము బయటకు రావడానికి గంటల ముందే అని వెల్లడించారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని ముర్ము తల్లిడిల్లిపోయాడు. అతడిని తలచుకుని గుండెలు పగిలేలా ఏడ్చాడు.
ఈ సందర్భంగా ముర్ము కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. ’’ముర్ము తండ్రి బర్సా ముర్ము.. మంగళవారం ఉదయం.. టిఫిన్ చేసి.. అల్లుడితో కలిసి ఇంట్లోని మంచం మీద కూర్చున్నాడు. మాట్లాడుతున్న వాడు అలానే అకస్మాత్తుగా మంచి మీద నుంచి కింద పడి చనిపోయాడు. భక్తు సొరంగంలో చిక్కుకున్నాడనే సమాచారం తెలిసిన తర్వాత బర్సా ముర్ము తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కుమారుడు క్షేమంగా రావాలని ప్రార్థించాడు. తీరా కన్న బిడ్డ కళ్ల ముందుకు వచ్చే సమయానికి కన్ను మూశాడని‘‘ తెలిపారు.
ఇక ఉత్తరాఖండ్ సిల్క్యార సహాయక చర్యలు మంగళవారం నాటికి ముగిసాయి. ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు.. 57 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తి చేసి.. కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత భారీ స్టీల్ పైప్ ని పంపించి అందులో నుంచి కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. టన్నెల్ వెలువల అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లలో కూలీలను ఆసుపత్రికి తరలించి.. వారికి చికిత్స అందించారు.