iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ MP ఇంట్లో 500 కోట్ల బ్లాక్ మనీ! అసలు ఎవరీ ధీరజ్ సాహు?

  • Published Dec 11, 2023 | 11:16 AM Updated Updated Dec 11, 2023 | 11:44 AM

జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో 350 కోట్లకు పైగా అక్రమ సంపాదన పట్టుబడింది. లెక్కించాల్సిన మొత్తం ఇంకా మిగిలే ఉంది. లెక్కింపు పూర్తయితే.. ఈ మొత్తం 500 కోట్లకు చేరే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ధీరజ్ సాహు బ్యాగ్రౌండ్ గురించి ఆసక్తికనబరుస్తున్నారు. ఆ వివరాలు..

జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో 350 కోట్లకు పైగా అక్రమ సంపాదన పట్టుబడింది. లెక్కించాల్సిన మొత్తం ఇంకా మిగిలే ఉంది. లెక్కింపు పూర్తయితే.. ఈ మొత్తం 500 కోట్లకు చేరే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ధీరజ్ సాహు బ్యాగ్రౌండ్ గురించి ఆసక్తికనబరుస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 11, 2023 | 11:16 AMUpdated Dec 11, 2023 | 11:44 AM
కాంగ్రెస్ MP ఇంట్లో 500 కోట్ల బ్లాక్ మనీ! అసలు ఎవరీ ధీరజ్ సాహు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ అక్రమ సంపాదన గురించే జోరుగా చర్చ సాగుతోంది. గత ఐదు రోజులుగా ఆదాయశాఖ పన్ను అధికారులు.. జార్ఖండ్‌ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఐదు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తుండగా.. భారీ మొత్తంలో నగదు వెలుగులోకి వస్తోంది. మొత్తం 176 సంచుల నిండా డబ్బును అధికారులు స్వాధీనం చేసుకోగా.. ఇప్పటి వరకు 140 సంచులను లెక్కించారు.

ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. ఇందుకు గాను 40 మెషిన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లెక్కించాల్సిన మొత్తం భారీగా ఉందని.. దీన్ని వేగవంతం చేయడానికి మరిన్ని మెషన్లు, మనుషులను సమకూర్చుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లెక్కింపు పూర్తయ్యేసరికి ధీరజ్ సాహు అక్రమ సంపాదన 500 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్ వివరణ..

ఇక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు నివాసంలో ఇంత భారీ మొత్తంలో అక్రమ సంపాదన వెలుగు చూడటంతో.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారు.. ఏం సమాధానం చెబుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతుంది.

ధీరజ్‌ సాహు వ్యాపారాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన ఆస్తులతోపాటు ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు గుర్తించిన నగదు గురించి సాహు మాత్రమే వివరణ ఇవ్వాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. భారీ మొత్తం పట్టుబడిన నేపథ్యంలో.. ఎవరీ ధీరజ్ సాహు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనే వివరాల గురించి నెటిజనులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ధీరజ్ సాహు నేపథ్యం..

ధీరజ్ ప్రసాద్ సాహు.. సామాజిక కార్యకర్త బల్దియో సాహు, సుశీలా దేవిల కుమారుడు. అలానే మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ సాహుకు సోదరుడు కూడా. బీఏ చదివిన ధీరజ్ సాహు లోహర్దగాలో నివసిస్తున్నాడు. చదువు పూర్తయిన తర్వాత 1977లో రాజకీయాల్లోకి వచ్చాడు. 1978లో జైల్ భరో ఆందోళనలో పాల్గొని జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. ఇలా ఉండగా తొలిసారి జూన్ 2009లో అతను రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత మరోసారి 2010లో కాంగ్రెస్ పార్టీ తరఫున జార్ఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఇక మే 4, 2018లో మరోసారి జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు.

who is deeraj sahu

అఫిడవిట్ లో 27 లక్షలే..

ధీరజ్ సాహు 2010 నుంచి జార్ఖండ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎంపీగా పదవిలో ఉన్నారు. ప్రస్తుత ఐటీ సోదాల్లో ఆయన నివాసంలో 350 కోట్లకు పైగా అక్రమ సంపాదన పట్టుబడింది. లెక్కింపు పూర్తయ్యే సరికి.. ఈ మొత్తం 500 కోట్లకు చేరవచ్చిన అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడో ఆశ్చర్యకరమైన అంశం ఉ:ది. అది ఏంటంటే.. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ధీరజ్ సాహు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో రూ.8.89 కోట్ల ఆస్తిని మాత్రమే ప్రకటించారు.

15 లక్షల నగదు ఖాతాలో జమ చేశారు. భార్య, వారిపై ఆధారపడిన వారితో సహా మొత్తం కుటుంబం వద్ద కేవలం రూ.27.50 లక్షల నగదు మాత్రమే ఉందన్నారు. ఇప్పుడు మాత్రం ఆయన సంపాదన వందల కోట్లకు చేరింది. ఇక తాజా పరిణామంతో ధీరజ్ సాహుపై ఈడీ చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. ఈ డబ్బుకు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం ఉందన్న అనుమానంతో.. ఒడిశాలోని ఈడీ జోనల్ కార్యాలయం విచారణకు ఆదేశించింది.

డిసెంబరు 6న ఐటీ దాడి ప్రారంభం..

కాంగ్రెస్ నేత, ఎంపీ ధీరజ్ సాహు మద్యం అమ్మకాలతో భారీగా ఆస్తులు కూడగట్టారని ఆరోపణలున్నాయి. అయితే ఆ నగదు ఆర్జించడంపై ఆదాయపు పన్ను ఎగవేశారని, పన్నుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని భావించి ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఐదు రోజుల నుంచి అనగా డిసెంబర్ 6 నుంచి బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు సంబంధిత వ్యక్తులపై ఐటీ శాఖ దాడులు మొదలుపెట్టింది. ఆ దాడులు ఆదివారం ఐదో రోజు కూడా కొనసాగాయి. ఇప్పటి వరకు ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరిందని.. ఇది మరింత పెరుగుతుందని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటన దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది.