iDreamPost

IRCTC న్యూ రూల్.. ట్రైన్ టిక్కెట్ ఇలా బుక్ చేస్తున్నారా? అయితే జైలుకే!

మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేస్తుంటారా. అయితే మీకు బిగ్ అలర్ట్. ఇకపై ఇలా ట్రైన్ టిక్కెట్ బుక్ చేస్తే జైలుకే.

మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేస్తుంటారా. అయితే మీకు బిగ్ అలర్ట్. ఇకపై ఇలా ట్రైన్ టిక్కెట్ బుక్ చేస్తే జైలుకే.

IRCTC న్యూ రూల్.. ట్రైన్ టిక్కెట్ ఇలా బుక్ చేస్తున్నారా? అయితే జైలుకే!

రైలు ప్రయాణికులు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే టిక్కెట్ తప్పనిసరి. అయితే ఇప్పుడు ప్రయాణికులు అంతా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. అధికారిక వెబ్ సైట్ ల ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ పర్సనల్ ఐడీ ద్వారా ఈజీగా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటుంటారు. ఈ ఐడీల ద్వారా కొంతమంది ఇతరులకు రైలు టికెట్ బుక్ చేస్తుంటారు. ఇలాంటి వారికి భారతీయ రైల్వే బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ట్రైన్ టిక్కెట్ ఇలా బుక్ చేస్తే జైలు శిక్ష విధించనుంది. ఈ మేరకు ఇండియన్ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

భారతీయ రైల్వే టిక్కెట్‌ బుకింగ్‌ విధానంలో కొన్ని మార్పులు చేసింది. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష ఖాయం అంటున్నారు అధికారులు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలకు టిక్కెట్లు, క్యాటరింగ్ మరియు పర్యాటక సేవలను అందించే భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ. కాగా ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడీ ద్వారా ఇతరుల కోసం ట్రైన్ టికెట్ బుక్ చేస్తే ఇండియన్ రైల్వే యాక్ట్ సెక్షన్ 143 ప్రకారం అది చట్టపరంగా నిబంధనను ఉల్లంఘించినట్టేనని.. దీంతో మూడేళ్ల పాటు జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా కూడా విధించనుంది రైల్వే డిపార్ట్ మెంట్.

train ticket

ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడి ద్వారా కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ ఐడి ద్వారా ఫ్రెండ్స్ కు టికెట్స్ బుక్ చేసినా రూల్స్ బ్రేక్ చేసినట్లే అవుతుందంటున్నారు. వినియోగదారులు ఐఆర్‌సీటీసీ ఐడి ఆధార్ లింక్ చేసిన వారు నెలకు 24 టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. ఆధార్ లింక్ లేకపోతే 12 టికెట్ల వరకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది. ఈ పరిమితి దాటితే రైల్వే డిపార్ట్ మెంట్ తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి