iDreamPost
android-app
ios-app

ISRO ఛైర్మన్ కు క్యాన్సర్.. ఆ ప్రయోగం రోజే బయటపడింది!

ISRO Chairman Recovered From Stomach Cancer: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తన ఆరోగ్యానికి సంబంధించి చెప్పిన విషయం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఆయనకు క్యాన్సర్ వచ్చినట్లు వెల్లడించారు.

ISRO Chairman Recovered From Stomach Cancer: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తన ఆరోగ్యానికి సంబంధించి చెప్పిన విషయం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఆయనకు క్యాన్సర్ వచ్చినట్లు వెల్లడించారు.

ISRO ఛైర్మన్ కు క్యాన్సర్.. ఆ ప్రయోగం రోజే బయటపడింది!

అంతరిక్ష పరిశోధనలో ఇండియాకి ప్రత్యేకం స్థానం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా భారత్ కూడా అంతరిక్షం అధ్యయనంలో దూసుకుపోతోంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసొచ్చినట్లు అయ్యింది. ఈ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కూడా ఒకరు. చంద్రయాన్ 3 సక్సెస్ లో ఆయన కృషి ఎంతో ఉంది. ఇప్పుడు ఆయన తన వ్యక్తిగత విషయం వెల్లడించారు. అది విన్న తర్వాత అందరూ షాకవుతున్నారు. అదేంటంటే.. ఆయనకు క్యాన్సర్ నిర్ధారణ జరిగింది.

ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. చంద్రయాన్ 3 సక్సెస్ లో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. అంతరిక్ష పరిశోధనలో భారత్ దూసుకెళ్లేలా చేస్తున్నారు. అలాంటి సోమనాథ్ ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అదేంటంటే.. ఆయనకు క్యాన్సర్ నిర్ధారణ జరిందట. ఆ విషయాన్ని స్వయంగా సోమనాథ్ ప్రకటించారు. ఒక మలయాళం వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాన్సర్ నిర్ధారణ జరిగిన సంగతిని తెలియజేశారు. చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలోనే తనకు కాస్త ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. కానీ, ఆ సమయంలో ఆ ఇబ్బంది మీద సరైన అవగాహన లేక పట్టించుకోలేదు అన్నారు.

ఆ తర్వాత ఆదిత్య ఎల్ 1 ప్రయోగం సమయంలో క్యాన్సర్ నిర్ధారణ జరిగినట్లు చెప్పారు. ఆ ప్రయోగం జరిగిన ఉదయమే తాను పలు స్కాన్స్ చేయించుకున్నాను అన్నారు. ఆ తర్వాత చెన్నై వెళ్లి మరికొన్ని పరీక్షలు, స్కాన్స్ చేయించుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆ పరీక్షల్లో తనకు క్యాన్సర్ నిర్ధరణ జరిగినట్లు తెలిపారు. ఈ విషయం తెలియగానే తన కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. సహోద్యోగులు కూడా ఎంతో కంగారు పడినట్లు చెప్పారు. అయితే ఇది వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధి అని తెలిపారు. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో స్వయంగా వెల్లడించారు. “ఆదిత్య ఎల్ 1 ప్రయోగం తర్వాత వైద్యులు శస్త్ర చికిత్ర చేయుంచుకోవాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత నేను ఆపరేషన్ చేయించుకున్నాను. కీమోథెరపీ కూడా తీసుకున్నాను.

కడుపులో వచ్చిన ఆ కణితి కోసం అవన్నీ భరించాల్సి వచ్చింది. అయితే నేను కేవలం నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే ఆస్పత్రిలో ఉన్నాను. ఆ తర్వాత నుంచి ఇస్రోలో విధుల్లో పాల్గొన్నాను. ఈ క్యాన్సర్ విషయం తెలిసినప్పుడు మొదట కాస్త కంగారు పడ్డాను. కానీ, క్యాన్సర్ కు పూర్తిస్థాయిలో చికిత్స ఉందనే విషయం గ్రహించిన తర్వాత కుదుటపడ్డాను. క్యాన్సర్ కు సరైన చికిత్స ఉందనే విషయంపై నాకు ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది” అంటూ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు. ఇస్రో ఛైర్మన్ చెప్పిన మాటలు ఎంతో మందిలో స్ఫూర్తి నింపాయి. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఎంతోమంది బాధితుల్లో నూతన ఉత్సాహాన్ని నింపినట్లు అయ్యింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడ్డారు. తిరిగి కోలుకుని తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రముఖలు ముందుకొచ్చి క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తే.. బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెంచినవారు అవుతారు.