iDreamPost
android-app
ios-app

RBI: పాత రూ.100 నోటు చెల్లదంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

  • Published Dec 30, 2023 | 4:18 PM Updated Updated Dec 30, 2023 | 4:33 PM

నోట్ల రద్దు అంశం దేశాన్ని ఎంతలా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరు వ్యాపారులు, సామాన్యులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇలా ఉండగా తాజాగా పాత రూ.100 నోటు కూడా రద్దవుతుందంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా ఆర్బీఐ ప్రతినిధి ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

నోట్ల రద్దు అంశం దేశాన్ని ఎంతలా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరు వ్యాపారులు, సామాన్యులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇలా ఉండగా తాజాగా పాత రూ.100 నోటు కూడా రద్దవుతుందంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా ఆర్బీఐ ప్రతినిధి ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Dec 30, 2023 | 4:18 PMUpdated Dec 30, 2023 | 4:33 PM
RBI: పాత రూ.100 నోటు చెల్లదంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

అవినీతిపై పోరాటం చేసేందుకు, నల్లధనాన్ని వెలికి తీసేందుకు గాను.. ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల క్రితం అనగా 2016, నవంబర్  8 అర్థరాత్రి నుంచి పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. 1000, 500 రూపాయల నోట్లు చెల్లవని తెలిపారు. వీటిని మార్చుకోవడానికి నెల రోజుల సమయం ఇచ్చారు. మోదీ నిర్ణయం వల్ల నల్లధనం వెలుగులోకి రావడం సంగతి అలా ఉంచితే.. సామాన్యులు, చిరువ్యాపారలు, మధ్యతరగతి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త 500 రూపాయల నోటుతో పాటు.. రూ.2 వేల నోటను కూడా తీసుకువచ్చింది. ఇక ఈ ఏడాది 2 వేల నోటును ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పాత రూ.100 నోటు చెల్లదనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

గత కొద్ది రోజులుగా.. పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తోంది. మోదీ ప్రభుత్వం కొత్త ఏడాదిలో పాత రూ.100 నోటును రద్దు చేయబోతుందంటూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. అంతేకాక ఈ పాత వంద నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ గడువు కూడా విధించినట్లు అందులో పేర్కొంటున్నారు. అలానే మరి కొన్ని ప్రాంతాల్లో పాత రూ.100 నోటు ఇస్తే తీసుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో  ప్రచారం చేస్తున్నారు. 2024 మార్చి 31 వరకు మాత్రమే పాత వంద రూపాయల నోటు చలామణి అవుతుందని.. ఆ తరువాత నిషేధం విధిస్తున్నట్లు రాసుకొచ్చారు.

ఈ క్రమంలో చాలా మంది దుకాణదారులు పాత వంద నోట్లను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దాంతో హైదరాబాద్ కు చెందిన ఓ యూజర్.. నగరంలో కొందరు వ్యాపారస్తులు.. పాత వంద నోట్లు రద్దు అవ్వబోతున్నాయని చెబుతూ.. వాటిని తీసుకోవడం లేదు. దీనికి సంబంధిచి ఆర్బీఐ ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా అంటూ రిజర్వ్ బ్యాంక్ ను  ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. పాత రూ. 100 నోటు రద్దు గురించి తాము ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని బదులిచ్చింది. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితిలో వంద నోట్లను రద్దు చేయబోమని తెలిపింది. దీంతో వంద నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవం అని తేలింది.