iDreamPost
android-app
ios-app

స్మగ్లర్స్ గుండెల్లో వణుకు పుట్టించిన ‘లేడీ సింగం’..ఈమె స్టోరీ యువతకు స్పూర్తి!

IPS Officer Mokshada Patil Life Story: సామాన్య కుటుంబం నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి అక్రమ ఆయుధాలు, ఇతర నేరాలకు పాల్పడే వారికి సింహ స్వప్నంగా నిలిచింది ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్. ఆమె స్టోరీలో ప్రతి సంఘటన గూస్ బంప్స్ తెప్పించక మానవు. నేటికాలం యువతలు ఆమె స్టోరీని స్పూర్తిగా తీసుకోవాలి.

IPS Officer Mokshada Patil Life Story: సామాన్య కుటుంబం నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి అక్రమ ఆయుధాలు, ఇతర నేరాలకు పాల్పడే వారికి సింహ స్వప్నంగా నిలిచింది ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్. ఆమె స్టోరీలో ప్రతి సంఘటన గూస్ బంప్స్ తెప్పించక మానవు. నేటికాలం యువతలు ఆమె స్టోరీని స్పూర్తిగా తీసుకోవాలి.

స్మగ్లర్స్ గుండెల్లో వణుకు పుట్టించిన ‘లేడీ సింగం’..ఈమె స్టోరీ యువతకు స్పూర్తి!

ప్రపంచంలో ఎంతో మంది కథల గురించి మనం వింటుంటాం. అయితే కొందరి కథలు గురించి తెలుకుంటున్నప్పుడు మాత్రం గూస్ బంప్స్ రాక మానవు. మరికొన్ని స్టోరీలు ఆడపిల్లలకు, మహిళలకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇంకొన్ని కథలు కేవలం అమ్మాయిలకు ధైర్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు..తప్పు చేసే నేరాగాళ్లకు ఒంట్లో వణుకు పుట్టేలా చేస్తాయి. తాజాగా ఓ లేడీ సింగం స్టోరీ వింటే మాత్రం మీరు హ్యాట్సాప్ చెప్పక మానరు. ఇక అమ్మాయిలు అయితే.. ఈమెలాగే జీవించాలనే అనుకోక మానరు. ఆమె మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి మోక్షదా పాటిల్. మరి.. ఈ లైఫ్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మహారాష్ట్రకు చెందిన మోక్షదా పాటిల్ డేరింగ్ అండ్ యాషింగ్ అధికారిగా పేరు సంపాదించారు. ఈమె తన పాఠశాల విద్యను ముంబైలోని మరాఠ మీడియం స్కూల్ లో పూర్తి చేసింది. ప్రాథమిక విద్య అనంతరం పొలిటికల్ సైన్స్ మరియు సోషియాలజీలో డిగ్రీని సంపాదించింది. అయితే ఆమె చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలనే కోరిక ఉండేది. అదే  లక్ష్యంతో తన విద్యను సాగిస్తూ వచ్చింది. ఇక డిగ్రీ అనంతరం మాస్టర్స్ డిగ్రీ కూడ  పుర్తి చేసింది. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందడం ద్వారా తన విద్యను పూర్తి చేసి..పట్టా పొందారు. ఆమె ఐజీఎన్ఓయూ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

మోక్షద పాటిల్ కు ఇంగ్లీష్ పై పూర్తి స్థాయి పట్టులేకున్నా..కేవలం మరాఠీ-మీడియం నేపథ్యం ఉన్నప్పటికీ యూపీఎస్సీ రాసేందుకు సిద్దమైంది. ఆమె యూపీఎస్  సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడానికి ఇంగ్లీష్ ఎంచుకుంది.  అప్పటి వరకు మరాఠీ మీడియంలో  చదవడంతో ఇంగ్లీష్ మీడియం కాస్తా ఇబ్బంది గా అనిపించింది. అయినా ఆమె లక్ష్యంగా ఉన్న కసితో.. ఆ మీడియం సమస్యను కూడా జయించింది. రేయింబవళ్లు కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అయ్యింది. చివరకు 2011లో ఆమె యూపీఎస్ పరీక్షల్లో విజయం సాధించింది. 237 ర్యాంకుతో ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యింది.

IPS mokshada patil inspiration story

ఇక ఐపీఎస్ కి ఎంపికైనా మోక్షదా పాటిల్.. సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకే పొస్టింగ్ వచ్చింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు మోక్షదా పాటిల్ ఎస్పీ గా విధులు నిర్వహించారు. కఠినమైన పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ కొన్నేళ్లు వివిధ స్థాయిలో బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇక పలు జిల్లాల్లో ఎస్పీగా ఉన్న సమయంలో ఆయుధాలను అక్రమంగా రవాణ చేసే ముఠాపై ఉక్కుపాదం మోపింది. వారి పాలిట మోక్షదా సింహ స్వప్నంగా నిలిచారు. ఆమె ఎక్కడ పోస్టింగ్ ఉంటే.. ఆ ప్రాంతంలోని ఆయుధాలు, గంజాయి వంటి వాటిని సరఫరా చేసే ముఠాలపై ఓ రేంజ్ లో విరుచకపడింది. అలా రాష్ట్రంలో ఆయుధాల స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో మోక్షదా పాటిల్ పేరు విస్తృతంగా వినిపించింది. రాష్ట్రంలోని వివిధ కఠినమైన కేసులను ఆమె సక్సెస్ ఫుల్ గా పరిష్కరించారు.

ఇలా లేడీ సింగంగా గుర్తింపు పొందిన ఈ జీవితంలో మధురమైన లవ్ స్టోరీ కూడా ఉంది. ఐపిఎస్ శిక్షణ సమయంలోఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి ఆస్తిక్ కుమార్ పాండే పరిచయం అయ్యారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. చివరకు  వారి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఇలా వ్యక్తిగతం జీవితంలోను, వృతిపరమైన జీవితంలోనే ఆమె సక్సెస్ ఫుల్ విమెన్ గా గుర్తింపు పొందారు. ఓ సాధారణ కుటుంబ నుంచి విజయవంతమైన  ఐపీఎస్ అధికారి వరకు ఆమె సాగిన ప్రయాణం ఎంతో మందికి  స్ఫూర్తినిస్తుంది.