వీడియో: అంతరిక్షంలో అద్భుతం.. చెన్నై మీదుగా ప్రయాణించిన స్పేస్ సెంటర్..!

International Space Station: శుక్రవారం అంతరిక్షంలో అరుదైన అద్భుతం జరిగింది. ఈ దృశ్యాన్ని చెన్నై వాసులు ఆస్వాదించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

International Space Station: శుక్రవారం అంతరిక్షంలో అరుదైన అద్భుతం జరిగింది. ఈ దృశ్యాన్ని చెన్నై వాసులు ఆస్వాదించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

విశ్వ అనేది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. ఈ అంతరిక్షంలో దాగి ఉన్న రహస్యంలో మనకు తెలిసింది. గోరంతా..తెలియాల్సింది కొండంతా. ఖగోళంలోని నిగూఢ రహస్యాలను కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రయోగాలతో విశ్వంలోని ఎన్నో రహస్యాలను కనిపెట్టారు. అలానే తరచూ అంతరిక్షంలో అనేక అద్భుత దశ్యాలు చోటుచేసుకుంటాయి. అలానే నిన్న కూడా ఓ  అరుదైన దృశ్యం కనిపించింది. అయితే ఆ దృశ్యం చెన్నై వాసులను కనువిందు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే  ఇంటర్నేషనల్ స్పేష్ సెంటర్ శుక్రవారం రాత్రి తమిళనాడు రాజధాని అయినా చెన్నైలో కనిపించింది. ఇక్కడి నగర వాసులను ఆ స్పేస్ సెంటర్ కనువిందు చేసింది. నీలాకాశంలో చిమ్మచీకట్లలో మిలమిలా మెరుస్తూ ఆ స్పేస్ సెంటర్ కన్పించడంతో ప్రజలు సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు అయితే ఈ ఆ అరుదైన దృశ్యాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

అయితే ఈ ఘటన గురించి అమెరిక అంతరిక్ష సంస్థ అయినా  నాసా కీలక విషయాలను వెల్లడించింది. తాము పంపించిన  అంతరిక్ష కేంద్రం భారత్ లో కనిపిస్తుందని స్పష్టం చేసింది. మే8 నుంచి 23వ తేదీ మధ్యలో భారతదేశంలోని పలు నగరాల్లోని ప్రజలకు ఈ స్పేస్ సెంటర్ కనిపిస్తుందని కొన్ని రోజుల క్రిత వెల్లడించింది.

ప్రస్తుతం సూర్యుడి కిరణాలు దీని మీద పడటంతో ఈ అంతరిక్ష కేంద్రం భారతీయులకు కన్పించనుందని తెలిపింది. అందరికి తెలిసినట్లే సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కన్పిస్తాడు.  సూర్యుడి కిరణాలు పడటంతో రాత్రి వేళ జాబిలి ప్రకాశవత్తంగా కనిపిస్తుంది. పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం.  కారణం.. సూర్యుడికి ఆ స్పేస్ సెంటర్ కి  మధ్య భూమి అడ్డు వస్తోంది. దీంతో కేవలం అదే రాత్రివేళల్లో మాత్రమే మెరుస్తూ కన్పిస్తుంది. ఇక ఈ అరుదైన దృశ్యం కొన్ని వారాల పాటు  దేశంలోని పలు పట్టణాల్లో కనిపించనుందని నాసా పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే మే 10 శుక్రవారం రాత్రి 7 గంటలకు కొన్ని నిమిషాల పాటు ఇది కనువిందు చేసింది.  ఎంతో ప్రకాశవంతగా మెరుస్తూ వేగంగా ప్రయాణిస్తూ నగరవాసులను కనువిందు చేసింది.  అదేవిధంగా మే 14 వరకు పలు సమయాల్లో మళ్లీ ఈ  అంతరిక్ష కేంద్రాన్ని చూడొచ్చని స్పేస్ ఎక్స్ పర్ట్స చెబుతున్నారు. శనివారం నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే దిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ  అరుదైన దృశ్యం కన్పించనుంది.

విశ్వంలో మెరిసే ప్రధానమైన వాటిల్లో మూడో అతిపెద్దది  ఈ  ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. ఇది ఇది మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత శాటిలైట్. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్ష్యలో భ్రణం చేస్తోంది. ఇది ఒకసారి  భూమి చుట్టు తిరగడానికి 93 నిమిషాలు పడుతుంది. ఈ స్పేస్ సెంటర్ ను అమెరికా, రష్యా, జపాన్‌, ఐరోపా, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. అనేక మంది సైంటిస్టులు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఇందులో పరిశోధనలు సాగిస్తుంటారు. మరి.. హైదరాబాద్  వాసులకు కూడా  అరుదైన దృశ్యం కనిపించే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Show comments