భర్త మృతి.. అత్తామామలకు కొడుకు అయిన కోడలు.. ఫ్యామిలీ కోసం డెలివరీ గర్ల్‌గా..

సొంత కొడుకులే అమ్మ, నాన్నలని పట్టించుకోవడం లేదు. అలాంటిది కొడుకు పోతే అతని తల్లిదండ్రులను చూసుకుంటారా? కానీ ఈమె మాత్రం తన అత్తా,మామలను వదిలేయకుండా తన సొంత పిల్లలతో సమానంగా చూసుకుంటున్నారు. వారి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కుటుంబం కోసం ఈమె పడుతున్న కష్టానికి నిజంగా ఆమెను మెచ్చుకోవాల్సిందే.

సొంత కొడుకులే అమ్మ, నాన్నలని పట్టించుకోవడం లేదు. అలాంటిది కొడుకు పోతే అతని తల్లిదండ్రులను చూసుకుంటారా? కానీ ఈమె మాత్రం తన అత్తా,మామలను వదిలేయకుండా తన సొంత పిల్లలతో సమానంగా చూసుకుంటున్నారు. వారి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కుటుంబం కోసం ఈమె పడుతున్న కష్టానికి నిజంగా ఆమెను మెచ్చుకోవాల్సిందే.

ఒకప్పుడు ఇంట్లో మగాళ్లే బయటకెళ్ళి సంపాదించాలి అనే నియమం ఉండేది. అయితే ఇప్పుడు ఆడవాళ్లు కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. మగాళ్ళతో పాటు సమానంగా కష్టపడుతున్నారు. కొడుకులే ఇంట్లోంచి అమ్మ, నాన్నలని గెంటివేస్తున్నారు. అలాంటిది అత్తింటి వారిని కన్న బిడ్డల్లా చూసుకునే కోడళ్ళు ఉంటారా? కానీ ఒకామె ఉన్నారు. భర్త చనిపోతే మెట్టింటి కుటుంబ బాధ్యతను తన భుజాన వేసుకుని కొడుకు లేని లోటుని తీరుస్తున్నారు. ఆమె పేరు సుప్రీతి సింగ్. మ్యాథ్స్ లో ఎంఎస్సీ చేశారు. కరోనా సమయంలో ఆమె భర్త మృతి చెందారు. కుటుంబంలో భర్త తండ్రి, ఒక కూతురు, కొడుకు ఉన్నారు. భర్త మృతితో వీరి బాధ్యతలను ఆమె తన భుజాన వేసుకున్నారు. కుటుంబాన్ని పోషించడం కోసం ఆమె ఫ్లిప్ కార్ట్ లో జాయిన్ అయ్యారు.

అయితే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి జీతాలు తక్కువని తెలిసిందేగా. తన కుటుంబ అవసరాలను తీర్చడం కోసం ఆమె పగలూ, రాత్రి కష్టపడుతున్నారు. భర్త బండితోనే ఆమె బతుకు బండిని నడుపుతున్నారు. మగవారిలా ఆమె బైక్ నడుపుతూ.. ఫ్లిప్ కార్ట్ లో కస్టమర్స్ ఆర్డర్ చేసిన ఉత్పత్తులను ఆమె డెలివరీ చేస్తున్నారు. తన కుటుంబం సంతోషంగా ఉండడం కోసం.. వారి అవసరాలను తీర్చడం కోసం ఆమె ఎక్కడా కూడా అలసిపోకుండా రాత్రి, పగలూ తేడా లేకుండా పని చేస్తున్నారు. 

 పశ్చిమ బెంగాల్ లోని హుగ్ల్లీలో రాజ్ హట్ దగ్గర బరోల్ అనే గ్రామంలో ఆమె నివసిస్తున్నారు. ఉదయం మొదలు పెట్టి రాత్రి వరకూ ఆమె ఫ్లిప్ కార్ట్ వస్తువులు ఇంటింటికీ డెలివరీ చేస్తుంటారు. ఉదయం 8 గంటలకు ఆమె డెలివరీ విమెన్ గా పని మొదలుపెడతారు. వస్తువులు డెలివరీ చేసి ఇంటికి తిరిగి వస్తారు. బండెల్, రాజ్ హట్, సుగంధర్ ఏరియాల్లో 50 కిలోల బ్యాగ్ తో ఆమె బైక్ మీద తిరుగుతారు. ఆమె పిల్లలిద్దరూ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ఆమె భర్త స్వామి స్వపన్ సింగ్ ఒక ప్రైవేటు కంపెనీలో కారు డ్రైవర్ గా పని చేసేవారు. అయితే కరోనా కారణంగా ఆయన మృతి చెందడంతో ఆమె కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. మొదట్లో ఆమెకు ఢిల్లీ రోడ్డులో రైస్ హోటల్ ఉండేది. అయితే కరోనా మహమ్మారి వల్ల నష్టం రావడంతో దాన్ని మూసేయాల్సి వచ్చింది.

ఇంటి దగ్గరే చిన్న కిరాణా స్టోర్ ప్రారంభించి డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం వర్కవుట్ కాలేదు. దీంతో ఆమె డెలివరీ ఉమెన్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా తన కుటుంబానికి రెండు పూటలా కడుపు నిండా అన్నం పెట్టడం కోసం.. వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఆమె డెలివరీ ఉమెన్ గా చేస్తున్నారు. ఇవాళ మహిళలు మగాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో స్థిరపడుతున్నారు. కష్టమైన పనులు కూడా చేస్తున్నారు. సుప్రీతి సింగ్ కూడా డైలీ 50 కిలోల బరువున్న బ్యాగ్ ని వీపుకి తగిలించుకుని ఉదయాన్నే తన ప్రయాణాన్ని మొదలుపెడతారు. అలసత్వం అనేది దరి చేయకుండా పని చేస్తున్నారు. మరి కుటుంబం కోసం మగాళ్లతో పోటీ పడి మరీ కష్టపడుతున్న ఈ తల్లికి ఒక హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 

Show comments