iDreamPost
android-app
ios-app

ఆ నిరుద్యోగులకు Infosys శుభవార్త! 2 ఏళ్ల కింద ఇచ్చిన మాటపై నిలబడుతూ..!

  • Published Aug 27, 2024 | 2:20 PM Updated Updated Aug 27, 2024 | 2:20 PM

Infosys CEO Salil Parekh Reassures Jobs: జాబ్ రాదు, తమ కష్టమంతా నేలపాలైందని బాధపడుతూ ఇళ్లలో కూర్చున్న ఆ నిరుద్యోగులకు గుడ్​న్యూస్. రెండేళ్ల కింద ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఇన్ఫోసిస్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

Infosys CEO Salil Parekh Reassures Jobs: జాబ్ రాదు, తమ కష్టమంతా నేలపాలైందని బాధపడుతూ ఇళ్లలో కూర్చున్న ఆ నిరుద్యోగులకు గుడ్​న్యూస్. రెండేళ్ల కింద ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఇన్ఫోసిస్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published Aug 27, 2024 | 2:20 PMUpdated Aug 27, 2024 | 2:20 PM
ఆ నిరుద్యోగులకు Infosys శుభవార్త! 2 ఏళ్ల కింద ఇచ్చిన మాటపై నిలబడుతూ..!

జాబ్ రాదు, తమ కష్టమంతా నేలపాలైందని బాధపడుతూ ఇళ్లలో కూర్చున్నారా నిరుద్యోగులు. ఇన్నాళ్లూ శ్రమించి ఉద్యోగం తెచ్చుకుంటే ఇలా అయిందేంటని దిగులు చెందారు. అయితే వాళ్లకు మాట ఇచ్చిన ఆ కంపెనీ మాత్రం దాన్ని మర్చిపోలేదు. ఆ నిరుద్యోగులకు గుడ్​న్యూస్ చెప్పింది. రెండేళ్ల కింద ఇచ్చిన మాట మీద నిలబడుతూ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన జాబ్ ఆఫర్స్​ను గౌరవిస్తామని, వాళ్లను తప్పకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తెలిపింది. స్వయంగా ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ ఈ విషయం చెప్పారు. ఆయన ప్రకటనతో ఇక ఉద్యోగం రాదని ఇళ్లల్లో కూర్చున్న 2 వేల మందికి జాబ్ రానుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్ఫోసిస్ సంస్థ రిక్రూట్​మెంట్ల విషయంలో చాలా పర్టిక్యులర్​గా ఉంటుంది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతూ ఎంపికైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 2022-23 రిక్రూట్​మెంట్ డ్రైవ్​లో భాగంగా సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ రోల్స్​ కోసం 2,000 మంది గ్రాడ్యుయేట్లను సెలెక్ట్ చేసింది. వాళ్లకు జాబ్ ఆఫర్ ఇచ్చింది టెక్ దిగ్గజం. అయితే వీళ్ల ఆన్​బోర్డింగ్ విషయంలో మాత్రం జాప్యం తలెత్తింది. రెండేళ్లు గడుస్తున్నా ఈ 2 వేల మందికి కంపెనీ జాబ్ ఇవ్వలేదు. దీంతో దీనిపై ఆశలు వదులుకున్నారు నిరుద్యోగులు. కానీ వాళ్లకు తాజాగా కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ గుడ్​న్యూస్ చెప్పారు. జాబ్ ఆఫర్ అందుకున్న ఆ రెండు వేల మందిని తప్పకుండా ఆన్​బోర్డింగ్​లోకి తీసుకుంటామని తెలిపారు. కొత్త గ్రాడ్యుయేట్స్​ను తాము గౌరవిస్తామన్న పరేఖ్.. వాళ్లను కచ్చితంగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తెలిపారు.

‘ఇంతకుముందు మేం జాబ్ ఆఫర్ ఇచ్చిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. వాళ్లు మా కంపెనీలో చేరతారు. మేం కొన్ని డేట్స్ మార్చాం. కానీ తప్పకుండా ప్రతి ఒక్కర్నీ జాబ్​లోకి తీసుకుంటాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు’ అని సలీల్ పరేఖ్ చెప్పారు. కాగా, 2022-23 రిక్రూట్​మెంట్​లో సెలెక్ట్ అయిన గ్రాడ్యయేట్లను ఇన్ఫోసిస్ ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. ఆన్​బోర్డింగ్​లో తలెత్తిన జాప్యాన్ని నిరసిస్తూ ఇన్ఫోసిస్​ మీద కంప్లెయింట్ చేసింది ఐటీ అండ్ ఐటీఈఎస్​ యూనియన్ నాస్కంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (ఎన్​ఐటీఈఎస్​). తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ కార్మిక శాఖకు ఎన్​ఐటీఈఎస్​ ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు వీళ్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు స్వయంగా సీఈవో పరేఖ్ క్లారిటీ ఇవ్వడంతో నిరుద్యోగులు సంతోషంలో మునిగిపోయారు.