iDreamPost
android-app
ios-app

భారతీయుల నిర్లక్ష్యం! 20 రోజుల్లోనే.. కేంద్ర ప్రభుత్వానికి వందల కోట్ల లాభం!

  • Published Aug 26, 2024 | 3:47 PM Updated Updated Aug 26, 2024 | 3:47 PM

Income Tax Department, ITR Filing, ITR last Date: ట్యాక్స్‌ పేయర్ల నిర్లక్ష్యం కారణంగా.. కేవలం 20 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి వంద కోట్ల లాభం వచ్చిపడింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే.. ఆ ఆర్టికల్‌ పూర్తిగా చదవండి.

Income Tax Department, ITR Filing, ITR last Date: ట్యాక్స్‌ పేయర్ల నిర్లక్ష్యం కారణంగా.. కేవలం 20 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి వంద కోట్ల లాభం వచ్చిపడింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే.. ఆ ఆర్టికల్‌ పూర్తిగా చదవండి.

  • Published Aug 26, 2024 | 3:47 PMUpdated Aug 26, 2024 | 3:47 PM
భారతీయుల నిర్లక్ష్యం! 20 రోజుల్లోనే.. కేంద్ర ప్రభుత్వానికి వందల కోట్ల లాభం!

పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టగానే.. వామ్మో అన్ని ట్యాక్సులు ఇన్ని ట్యాక్సులా? ఎలా భరించాలి? ఎలా బతకాలి అనే కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అంతా నార్మల్‌ అయిపోయి.. నిర్లక్ష్యంగా చిన్న చిన్న తప్పులు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి వంద కోట్లను అప్పనంగా ఇస్తున్నారు. గత 20 రోజుల్లోనే ట్యాక్స్‌ పేయర్ల నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.629 కోట్ల లాభం వచ్చింది. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ట్యాక్స్‌ పేయర్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేస్తారనే విషయం తెలిసిందే.

ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2023-24(అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2024-25)కు సంబంధించి ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేందుకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ ఏడాది జులై 31 వరకు గడువు ఇచ్చింది. ఒక వేళ గడువు దాటిని తర్వాత కూడా రిటర్న్స్‌ ఫైల్‌ చేయవచ్చు. దాన్ని బిలేటెడ్‌ ఐటీ రిటర్న్స్‌ అంటారు. గడువు తేదీలోగా అంటే.. జులై 31 వరకు దాదాపు 7.28 కోట్ల మేర ఐటీ రిటర్న్స్‌ను ఫైల్‌ అయినట్లు.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. అయితే.. ఇప్పుడు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ తాజాగా డేటాను పరిశీలిస్తే.. ఐటీ రిటర్న్స్‌ సంఖ్య 7.48 కోట్లకు పెరిగింది. 7.28 కోట్ల రిటర్న్స్‌ 2024 జులై 31లోపు ఫైల్‌ అయితే.. ఆ పెరిగిన సంఖ్య 2024 ఆగస్టు 1 నుంచి 22 మధ్య ఫైల్‌ అయ్యాయి. దాదాపు 13.94 లక్షల ఐటీ రిటర్న్స్‌ ఆగస్టు 1 నుంచి 22 మధ్య ఫైల్‌ అయ్యాయి.

జులై 31 తర్వాత ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేస్తే ఫైన్‌ చెల్లించాలి. ఈ 13.94 లక్షల ఐటీ రిటర్న్స్‌ ఇలా ఫైన్‌తో ఫైల్‌ చేశారు. ఆ ఫైన్‌ రూ.1000 నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది. ఇలా లేట్‌గా ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయడంతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటకే రూ.629 కోట్ల ఆదాయం సమకూరింది. ఫైన్‌తో కలిసి ఐటీ రిటర్స్న్‌ ఫైల్‌ చేయడానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు సమయం ఉంది. అప్పటి వరకు మరిన్ని రిటర్న్స్‌ ఫైల్‌ కావొచ్చు. అవి కూడా ఫైన్‌తోనే.. సో కేంద్ర ప్రభుత్వానికి మరింత ఆదాయం రావొచ్చు. ఈ వంద కోట్ల ఆదాయం ట్యాక్స్‌ పేయర్ల నిర్లక్ష్యంతోనే వచ్చింది. గడువులోగా ఐటీ రిటర్న్స్‌ను ఫైల్‌ చేయకపోవడం ఫైన్‌ చెల్లించాల్సి వస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.