iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు గుడ్​ న్యూస్.. వందే భారత్ ప్లేసులో వందే సాధారణ్! ఛార్జీలు ఎంతంటే?

  • Author singhj Updated - 05:54 PM, Tue - 19 December 23

నార్త్ నుంచి సౌత్ వరకు, వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా అన్ని రాష్ట్రాలకు, మారుమూల ప్రాంతాలకు రైల్వే విస్తరించింది. భారతీయ రైల్వేతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది.

నార్త్ నుంచి సౌత్ వరకు, వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా అన్ని రాష్ట్రాలకు, మారుమూల ప్రాంతాలకు రైల్వే విస్తరించింది. భారతీయ రైల్వేతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది.

  • Author singhj Updated - 05:54 PM, Tue - 19 December 23
ప్రయాణికులకు గుడ్​ న్యూస్.. వందే భారత్ ప్లేసులో వందే సాధారణ్! ఛార్జీలు ఎంతంటే?

మన దేశంలో రవాణా వ్యవస్థలో చాలా ముఖ్యమైనదిగా రైల్వేలను చెప్పుకోవచ్చు. రవాణాకు సంబంధించిన ఇండియాలో అతిపెద్ద నెట్​వర్క్ కలిగింది రైల్వేలే కావడం గమనార్హం. నార్త్ నుంచి సౌత్ వరకు, వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా అన్ని రాష్ట్రాలకు, మారుమూల ప్రాంతాలకు రైల్వే విస్తరించింది. భారతీయ రైల్వేతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. అంతర్​జిల్లా, అంతర్రాష్ట్ర ప్రయాణాల కోసం మన దేశంలోని అధిక శాతం మంది ప్రజలు రైల్వేలను ఆశ్రయిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అందుకే తన నెట్​వర్క్​ను, సేవలను కాలానుగుణంగా మార్చుకుంటూ పోతోంది రైల్వే. అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తూ ప్యాసింజర్లను ఆకట్టుకోవడంలో రైల్వే ముందుంది.

సుదూరాలకు తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రయాణం ఉండటంతో ప్రజలు తమ తొలి ప్రాధాన్యతగా రైళ్లను ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రయాణికుల రద్దీ, ప్యాసింజర్ల విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని సెమీ హైస్పీడ్ రైళ్లను ఇటీవల తీసుకొచ్చింది రైల్వే. వందే భారత్​గా పిలిచే ఈ రైళ్లు అత్యంత వేగంతో దూసుకెళ్లడమే గాక అత్యాధునిక సదుపాయాలను కూడా కలిగి ఉన్నాయి. దీంతో వీటికి మంచి ఆదరణ దక్కుతోంది. ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో వందే భారత్​ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్యాసింజర్ల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. దీంతో స్లీపర్ క్లాస్ ఫెసిలిటీస్​తో ప్రజల ప్రయాణ భారాన్ని తగ్గిస్తూ త్వరలో వందే సాధారణ్​ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు.

ప్రస్తుతం ఏసీ వందే భారత్ రైళ్ల తయారీకి రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. అయితే నాన్ ఏసీ వందే సాధారణ్​కు రూ.65 కోట్లు దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్ల తయారీని మొదలుపెట్టారు. వందే సాధారణ్ రైలు ఈ ఏడాది ఆఖర్లో పట్టాలెక్కనుందట. ఇందులో మొత్తం 24 బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోగీలన్నీ ఎల్​హెచ్​బీ కోచ్​లే ఉంటాయి. అలాగే రెండు లోకోమోటివ్స్ ఉంటాయి. ఈ రైళ్లలో బయో వాక్యూమ్ టాయ్​లెట్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఛార్జింగ్ పాయింట్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. వీటితో పాటు ప్రతి కోచ్​లో సీసీటీవీ కెమెరా, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కూడా కల్పించనున్నారు. సాధారణ రైళ్లకు ఉండే ఛార్జీలే వందే సాధారణ్ ట్రైన్స్​లోనూ వర్తించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ రైళ్ల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లైతే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.