Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత సౌకర్యంగా నిద్రపోవచ్చు!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత సౌకర్యంగా నిద్రపోవచ్చు!

Indian Railways: ప్రయాణికుల సౌకర్యం విషయంలో రైల్వే శాఖ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలానే తరచూ పలు రకాల గుడ్ న్యూస్ లు అందిస్తుంది. తాజాగా ఏసీ కంపార్టమెంట్ లో ప్రయాణించే వారికి ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది.

Indian Railways: ప్రయాణికుల సౌకర్యం విషయంలో రైల్వే శాఖ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలానే తరచూ పలు రకాల గుడ్ న్యూస్ లు అందిస్తుంది. తాజాగా ఏసీ కంపార్టమెంట్ లో ప్రయాణించే వారికి ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది.

ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక సదుపాయాలను కల్పిస్తుంది. అంతేకాక ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మరింత మెరుగు పర్చి..  ప్రయాణికుల జర్నీని మరింత సుఖవంతం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా రైలులోని వివిధ తరగతులకు చెందిన ప్రయాణికులకు అందించే సదుపాయాలు ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఏసీ కంపార్టుమెంట్ లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ట్రైన్లలో ఏసీ బోగీలు అనేవి కచ్చితంగా ఉంటాయి. ఇక ఈ కంపార్టుమెంట్ లో ప్రయాణించే వారికి కొన్ని ప్రత్యేక సదుపాయలు ఉంటాయి. ముఖ్యంగా ఏసీ క్లాస్ లో ప్రయాణించే వారికి దుప్పట్లు అందించే విషయం తెలిసింది. అయితే తాజాగా ఈ దుప్పట్ల విషయంలో ఇండియన్ రైల్వే ఆధునిక హంగులను అద్దేందుకు సిద్ధమైంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా అత్యంత మృదువైన దుప్పట్లను అందించాలని నిర్ణయించింది.

ఇవి ఎక్కువకాలం శుభ్రంగా, నాణ్యంగా ఉండటంతో పాటు ప్రయాణికులు ఈ దుప్పట్లు కుప్పుకుంటే మెరుగ్గా శ్వాస తీసుకునేలా ప్రత్యేకమైన లెనిన్‌తో తయారు చేయిస్తున్నారు. వీటి తయారీ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్‌)తో కలిసి ఇండియన్ రైల్వే విస్తృత పరిశోధన చేసింది. అలాగే, ఈ దుప్పట్ల తయారీ విషయంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లను సంప్రదించింది. ఈ సందర్భంగా నార్త్ రైల్వే సోషల్ మీడియా ద్వారా కొన్ని కీలక విషయాలను వెళ్లడించింది. ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగేలా చూడటం  ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఉత్తర రైల్వే తెలిపింది. నూతన దుప్పట్ల అనేది ప్రయోగాత్మకంగా బుధవారం రాంచీ- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో ప్రవేశ పెట్టనున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను రైల్వే శాఖ.. తమ అధికారిక ఎక్స్ వేదికలో పోస్ట్ చేసింది. ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తో సంప్రదించి, ప్యాసింజర్లకు అత్యుత్తమ సౌకర్యాన్ని, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని అందించే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌ల నుంచి సలహాలు తీసుకుని, అనేక పరిశోధనల అనంతరం ఈ దుప్పట్లను రూపొందించాం. వీటిని రాంచీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో ఆగస్టు 14న ప్రవేశపెట్టాం. ఆగస్టు 17న బిలాస్‌పూర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లోనూ ప్రారంభిస్తాం. ఆ రైళ్లలోని ప్రయాణికుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మిగతా రైళ్లలో అందుబాటులోకి తీసుకొస్తాం’ అని ఉత్తర రైల్వే ఎక్స్‌లో వెల్లడించింది. మొత్తంగా రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments