iDreamPost

ముక్కుతో టైపింగ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన భారతీయుడు!

  • Published Jun 09, 2024 | 12:09 PMUpdated Jun 09, 2024 | 12:09 PM

Typing Man Of India: చేతులతో ఫాస్ట్ గా టైప్ చేసే ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ముక్కులతో, చెవులతో టైప్ చేసే ట్రెండ్ నడుస్తోంది. ఒక యువకుడు ముక్కుతో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని టైప్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.

Typing Man Of India: చేతులతో ఫాస్ట్ గా టైప్ చేసే ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ముక్కులతో, చెవులతో టైప్ చేసే ట్రెండ్ నడుస్తోంది. ఒక యువకుడు ముక్కుతో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని టైప్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.

  • Published Jun 09, 2024 | 12:09 PMUpdated Jun 09, 2024 | 12:09 PM
ముక్కుతో టైపింగ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన భారతీయుడు!

చేతి వేళ్ళతో రికార్డు బ్రేక్ చేసేంత ఫాస్ట్ గా టైపింగ్ చేయాలంటేనే కష్టం. అలాంటిది ఈ వ్యక్తి ఏకంగా ముక్కుతో ఫాస్ట్ గా టైపింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డునే సొంతం చేసుకున్నారు. ముక్కుతో ఏ టూ జడ్ ఆల్ఫాబెట్స్ ని తక్కువ సమయంలో టైప్ చేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం.. 44 ఏళ్ల వినోద్ కుమార్ అనే వ్యక్తి మూడు సార్లు ముక్కుతో ఫాస్ట్ గా ఆల్ఫాబెట్స్ ని టైప్ చేసేందుకు ఎంటర్ అయ్యారు. అయితే మూడు సార్లు కూడా తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నారు. తొలుత వినోద్.. 2023లో 27.80 సెకండ్స్ లో ముక్కుతో ఆల్ఫాబెట్స్ ని టైప్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో అదే ఏడాదిన 26.73 సెకండ్స్ లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని ముక్కుతో టైప్ చేసి తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నారు.

ఇప్పుడు మూడో ప్రయత్నంగా 25.66 సెకండ్స్ లోనే తన పేరు మీద ఉన్న రెండు రికార్డులను బద్దలకొట్టారు. ముక్కుతో ఆల్ఫాబెట్స్ ని టైప్ చేయడం ఒక ఎత్తు అయితే.. ఆ లెటర్స్ మధ్య స్పేస్ ఇస్తూ టైప్ చేయడం మరొక ఎత్తు. దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ముక్కుతో మీరు తక్కువ సమయంలో ఎంత ఫాస్ట్ గా స్పేస్ ఇస్తూ ఆల్ఫాబెట్స్ ని టైప్ చేయగలరా? వినోద్ కుమార్ కేవలం 26.73 సెకండ్స్ లోనే టైప్ చేయగలిగారు అంటూ ఒక పోస్ట్ పెట్టింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చెబుతున్న దాని ప్రకారం.. 44 ఏళ్ల వినోద్ కుమార్.. సాధారణ క్వర్టీ కీబోర్డ్ లో ఉన్న రోమన్ ఆల్ఫాబెట్స్ ని అక్షరానికి, అక్షరానికి మధ్య స్పేస్ ఇస్తూ టైప్ చేశారు. మూడోసారి తన రికార్డుని తానే బ్రేక్ చేసి టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు.

అంతేకాదు సింగిల్ హ్యాండ్ తో వెనుక నుంచి అంటే జడ్ నుంచి ఏ వరకూ ఆల్ఫాబెట్స్ ని 5.36 సెకండ్స్ లో టైప్ చేసి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలానే వెనక్కి తిరిగి చేతులతో ఆల్ఫాబెట్స్ ని 6.78 సెకండ్స్ లో టైప్ చేసి మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అతని ప్రొఫెషన్ టైపింగ్ కావడంతో ఈ రికార్డులను ఈజీగా బ్రేక్ చేయగలిగారు. అయితే ఈ రికార్డుల కోసం తాను గంటల తరబడి ప్రాక్టీస్ చేసినట్లు వినోద్ తెలిపారు. మాజీ అంతర్జాతీయ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లా ఎక్కువ రికార్డులు బ్రేక్ చేయాలని తన డ్రీమ్ అని తెలిపారు. మరి ముక్కుతో వేగంగా ఆల్ఫాబెట్స్ ని టైప్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న వినోద్ కుమార్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి