Somesekhar
Anjali Chakra and Sufi Malik: 5 సంవత్సరాలు ప్రేమించుకున్న ఓ లెస్బియన్స్ జంట పెళ్లికి కొన్ని రోజులు ఉందనంగా విడిపోయారు. ఇండియా-పాక్ అమ్మాయిల లెస్బియన్ ప్రేమ కథ ఏంటి? వారు ఎందుకు విడిపోయారు?
Anjali Chakra and Sufi Malik: 5 సంవత్సరాలు ప్రేమించుకున్న ఓ లెస్బియన్స్ జంట పెళ్లికి కొన్ని రోజులు ఉందనంగా విడిపోయారు. ఇండియా-పాక్ అమ్మాయిల లెస్బియన్ ప్రేమ కథ ఏంటి? వారు ఎందుకు విడిపోయారు?
Somesekhar
ప్రేమ ఎప్పుడు? ఎవరి మీద? ఎందుకు పుడుతుందో చెప్పలేం. మారుతున్న ఆధునిక కాలంలో ప్రేమలు కూడా మారిపోతున్నాయి. అబ్బాయిలు అమ్మాయిలే కాదు.. అబ్బాయి మరో అబ్బాయిని, అమ్మాయి మరో మహిళను ప్రేమించి పెళ్లాడుతున్నారు. ఇలాంటి వివాహలు కూడా ప్రపంచంలో ఎన్నో జరిగాయి. తాజాగా 5 సంవత్సరాలు ప్రేమించుకున్న ఓ లెస్బియన్స్ జంట పెళ్లికి కొన్ని రోజులు ఉందనంగా విడిపోయారు. ఇండియా-పాక్ అమ్మాయిల లెస్బియన్ ప్రేమ కథ ఏంటి? వారు ఎందుకు విడిపోయారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అంజలి చక్ర, సూఫీ మాలిక్.. ప్రస్తుతం ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దానికి కారణం వారిద్దరు విడిపోవడమే. భారత్ కు చెందిన అంజలి చక్ర, పాకిస్తాన్ కు చెందిన సూఫీ మాలిక్ ఇద్దరు గత 5 సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ లెస్బియన్ జంట పెళ్లి చేసుకుందామని ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. త్వరలోనే మూడుముళ్ళ బంధంతో ఒక్కటౌవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ.. పెళ్లికి కొన్ని వారాల ముందు తాము విడిపోతున్నామని ప్రకటించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. తాము విడిపోతున్న విషయాన్ని ఇద్దరూ అంగీకరించారు.
ఇక ఈ విషయంలో అంజలి చక్రను మోసం చేసినట్లుగా స్వయంగా ఒప్పుకుంది సూఫీ మాలిక్. తాను తప్పు చేశానని అంజలిని క్షమాపణలు కోరుతున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది. అయితే ఆ తప్పు ఏ విషయంలో జరిగిందో మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. ఇదిలా ఉండగా.. ఇండియాకు చెందిన అంజలి న్యూయార్క్ లో నివసిస్తోంది. కొన్ని సంవత్సరాలు హెల్త్ కేర్ లో వర్క్ చేసిన అంజలి.. ప్రస్తుతం ఈవెంట్ ప్లానర్ గా చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ కు చెందిన సూఫీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరు కలిసి సూఫీ అండ్ అంజలి అనే ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేశారు. మరి ఇండియా-పాకిస్తాన్ కు చెందిన లెస్బియన్ జంట విడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: Hyderabad: ప్రపంచ కుబేరుల్లో హైదరాబాదీల హవా! లిస్ట్ లో మనోళ్లే ఎక్కువ!