Tirupathi Rao
Lok Sabha Elections 2024- 4 Men Passed Away: రెండో విడత లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉన్న 88 లోక్ సభ స్థానాల్లో జరుగుతున్నాయి. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Lok Sabha Elections 2024- 4 Men Passed Away: రెండో విడత లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉన్న 88 లోక్ సభ స్థానాల్లో జరుగుతున్నాయి. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Tirupathi Rao
దేశవ్యాప్తంగా విడతలవారీగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పూర్తికాగా.. శుక్రావరం రెండో విడత పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 లోక్ సభ స్థానాలు పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా కేరళలో 20 స్థానాలు, కర్ణాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 8, ఛత్తీస్ గఢ్- బెంగాల్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలు, జమ్ముకశ్మీర్- త్రిపుర- మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానం చొప్పు శుక్రవారం రెండో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఎండాకాలం కావడంతో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు క్యూలోకి చేరిపోతున్నారు. త్వరగా ఓటేస్తే పనైపోతుందని భావిస్తున్నారు. కానీ, సూర్యూడు కూడా అంతే భగ భగలాడుతున్నాడు.
ఏ రాష్ట్రంలో చూసినా మండే ఎండలు ఓటర్లను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. సూర్యూడు రావడంతోనే మండే కొలిమిలా వచ్చేస్తున్నాడు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఎండను కూడా లెక్క చేయకుండా క్యూలో నిల్చుని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ఎండలు దెబ్బకు ఓటర్లు అల్లాడి పోతున్నారు. కేరళ రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఓటు కోసం వచ్చిన ముగ్గురు ఓటర్లు, ఒక పోలింగ్ ఏజెంట్ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అలప్పుజా జిల్లా అంబలప్పుజాలో 76 ఏళ్ల వృద్ధుడు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశాడు. కానీ, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మలప్పురం జిల్లా తిరూర్ లో మదర్సా ఉపాధ్యాయుడు ఓటేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వయసు 63 సంవత్సరాలు ఉంటాయి.
కోజికోడ్ టౌన్ బూత్ నంబర్ 16లో పోలింగ్ ఏజెంట్ గా చేస్తున్న అనీస్ అహ్మద్(66) ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పాలక్కాడ్ లోని ఒట్టపాలెంలో ఓటేసిన తర్వాత 68 ఏళ్ల ఓటర్ కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కేరళ రాష్ట్రంలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే.. ఒట్టపాలంలో 38 డిగ్రీలు, కోజికోడ్ లో 33 డిగ్రీలు, తిరుర్ లో 34 డిగ్రీలు, అంబలప్పుజలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండలు మండిపోతున్నా కూడా.. పోలింగ్ శాతం పర్వాలేదు అనిపిస్తోంది. రెండో విడత పోలింగ్ జరుగుతున్న 88 లోక్ సభ స్థానాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు 35 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రానికి పోలింగ్ సరళి మారుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఎండతుల తగ్గుముఖ పట్టిన తర్వాత 4 గంటల నుంచి పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు.