P Venkatesh
మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) పర్సనల్ ఐడీ ద్వారా ఇతరులకు టిక్కెట్స్ బుక్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్ ప్రకారం జైలు శిక్ష పడొచ్చు.
మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) పర్సనల్ ఐడీ ద్వారా ఇతరులకు టిక్కెట్స్ బుక్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్ ప్రకారం జైలు శిక్ష పడొచ్చు.
P Venkatesh
రైలు ప్రయాణం చేసే వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ట్రైన్ టిక్కెట్ తీసుకోవడం తప్పనిసరి. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఇండియన్ రైల్వేస్ చట్టం ప్రకారం అధికారులు జరిమానా విధిస్తారు. అయితే ఇదివరకు ట్రైన్ జర్నీ చేసే వారు తమ టిక్కెట్ లను ఆయా రైల్వే స్టేషన్స్ కు నేరుగా వెళ్లి తీసుకునే వారు. నేడు టెక్నాలజీ పెరగడం టిక్కెట్ బుకింగ్ ఆన్ లైన్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో అందరూ ఆన్ లైన్ లోనే టిక్కెట్ లను బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) పర్సనల్ ఐడీ ద్వారా ఈజీగా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. అయితే రైల్వే టికెట్ బుకింగ్స్ విషయంలో ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మీ పర్సనల్ ఐడీల ద్వారా ఇతరులకు టిక్కెట్ లను బుక్ చేస్తే జైలు శిక్ష విధించనుంది. దీనికి గల కారణం ఏంటంటే?
భారతీయ రైల్వే ట్రైన్ టికెట్ బుక్ చేసే వారికి షాక్ ఇచ్చింది. ఇతరులకు ఐఆర్‌సీటీసీ ఐడీ ఇవ్వవద్దని రైల్వేశాఖ వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ రైల్వే టికెట్ బుకింగ్స్‌లో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం మీ ఐఆర్‌సీటీసి ఐడీతో ఇతరులకు టిక్కెట్ బుకింగ్ చేయలేరు. ఒక వేళ వేరే వారికి టిక్కెట్ బుక్ చేశారంటే జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా పడే అవకాశం ఉంది. ఇకపై గతంలో మాదిరిగా ఒకరి ఐడీతో వేరే వారికి టికెట్లు బుక్ చేశారంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కాగా ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడీ ద్వారా ఇతరుల కోసం ట్రైన్ టికెట్ బుక్ చేస్తే ఇండియన్ రైల్వే యాక్ట్ సెక్షన్ 143 ప్రకారం అది చట్టపరంగా నిబంధనను ఉల్లంఘించినట్టేనని.. దీంతో మూడేళ్ల పాటు జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా కూడా విధించనుంది రైల్వే డిపార్ట్ మెంట్.
సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం ఇక నుంచి కేవలం ఆధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులకు మాత్రమే మీ వ్యక్తిగత ఐడీ పేరుతో రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేయాలి. ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడీలను ఇతరులకు ఇవ్వొద్దని రైల్వే శాఖ సూచించింది. యూజర్లు ఐఆర్‌సీటీసీ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం చేసిన వారు నెలకు 24, అనుసంధానం చేయని వారు 12 టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటును ఐఆర్‌సీటీసీ కల్పించింది. ఈ పరిమితి దాటితే రైల్వే చట్టాన్ని అతిక్రమిచినట్లే అని ఇందుకు చర్యలు తప్పవని రైల్వే శాఖ తెలిపింది.