School Holiday: భారీ వర్షాలు.. IMD రెడ్‌ అలర్ట్‌.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

IMD Red Alert: విద్యార్థులకు అలర్ట్‌.. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆ వివరాలు..

IMD Red Alert: విద్యార్థులకు అలర్ట్‌.. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆ వివరాలు..

నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో.. దేశవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే జూన్‌ నెల ప్రారంభం నుంచే భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇక ఈ ఏడాది జోరు వానలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయ్యి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం కారణంగా భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వర్షాలకు సంబంధించి ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో.. ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఆ వివరాలు..

ఇక గత రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన దగ్గరే కాక దేశవ్యాప్తంగా జోరుగా  వానలు పడుతున్నాయి. గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశ వాతావరణ శాఖ.. గోవాలో వర్షాలకు సంబంధించి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పైగా పగటిపూట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో ఐఎండీ అలర్ట్‌ నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు నేడు అనగా సోమవారం నాడు సెలవు ప్రకటించారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. అంతేకాక ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని కోరారు.

మరోవైపు భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రం అసోం అల్లాడిపోతోంది. వరద కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి. 3 వేలకుపైగా గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. భారీ వరదల నేపథ్యంలో అసోంలో ఇప్పటికే 58 మంది మృతి చెందినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 లక్షల మందిపై వరదల ప్రభావం పడిందని.. లక్షలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు నదులు ప్రమాదస్థాయి కన్నా ఎక్కువగా ప్రవహిస్తూ భయపెడుతున్నాయి.

అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న 2-4 రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావరంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలపడమే కాక అనేక ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Show comments