వీడియో: భర్తలంటే ఇలా ఉండాలి.. వరద నీటిలో భార్యలను ఎత్తుకుని మరీ

Husbands Carry Their Wives In Flood Water: భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి ప్రేమ పెళ్ళైన కొత్తలోనే ఉంటుందని అనుకుంటారు. కానీ కొంతమంది పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా ఉంటారు. దానికి ఈ వీడియోనే నిదర్శనం. వరద నీటిలో భార్యలను ఎత్తుకుని మరీ ఈ భర్తలు వాళ్ళని..

Husbands Carry Their Wives In Flood Water: భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి ప్రేమ పెళ్ళైన కొత్తలోనే ఉంటుందని అనుకుంటారు. కానీ కొంతమంది పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా ఉంటారు. దానికి ఈ వీడియోనే నిదర్శనం. వరద నీటిలో భార్యలను ఎత్తుకుని మరీ ఈ భర్తలు వాళ్ళని..

దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే ఈ భారీ వర్షాలకు రహదారులు చెరువులని తలపిస్తున్నాయి. మోకాళ్ళ లోతు నీళ్లు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఒక పక్క వర్షాలు బీభత్సం చేస్తుంటే.. మరోపక్క కూల్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముహూర్తం వచ్చినా.. మూడొచ్చినా జరగాల్సిన కార్యం జరగాల్సిందే అని వర్షానికి కూడా భయపడి వెనక్కి తగ్గడం లేదు. పెళ్ళికి వచ్చేవాళ్ళు కూడా అలానే తడుచుకుంటూ వస్తున్నారు. మరి అంత ఖర్చు పెట్టి తడుచుకుంటూ వచ్చి ఏమీ తినకుండా వెళ్తే ఎలా? దారి ఛార్జీలు కూడా గిట్టవు కదా. అందుకే మోకాళ్ళ లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి మరీ విందు భోజనం ఆరగించారు. అయితే ఇక్కడ నడిచింది, తడిచింది భర్తలే.. భార్యలు మాత్రం ఎంచక్కా భర్త చేతుల్లో పల్లకిలో పెళ్లికూతురు కూర్చున్నట్టు కూర్చున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ లో ఓ ప్రాంతంలో పెళ్లి జరిగింది. ఆ సమయంలో కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతమంతా నీట మునిగింది. అయినప్పటికీ పెళ్లికి వచ్చే అతిథులు ఆగలేదు. మోకాళ్ళ లోతు నీరు చేరినా కూడా లెక్కచేయకుండా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళన్నాక విందు మస్ట్ గా, మస్తుగా ఉంటుంది. వర్షం వస్తే ఏంటి.. వండిన వంటలు వేస్ట్ అవ్వకూడదని ఆ వర్షంలోనే పెట్టేస్తూ ఉంటారు. పెళ్లికొచ్చిన వాళ్ళు కూడా ఆ వర్షంలోనే తినేస్తుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే భోజనాలు తినాలంటే మోకాలి లోతు తడవాల్సిందే.. మునగాల్సిందే. అయితే భార్యలు తడిస్తే, మునిగితే బాగోదని ఇలా భర్తలే వాళ్ళని చేతులతో ఎత్తుకుని మరీ భోజనాల దగ్గరకు తీసుకెళ్లారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఎంత వరద వచ్చినా విందు భోజనం మాత్రం మానకూడదు.. ఈ స్ఫూర్తి చెక్కు చెదరకూడదు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో భర్తలు భార్యలను ఇలా ఎత్తుకుని తీసుకెళ్లడంపై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. భర్తలంటే ఇలా ఉండాలి.. ప్రేమ అంటే అది.. వరద నీటిలో భార్యలను ఎలా ఎత్తుకుని తీసుకెళ్తున్నారో.. వాళ్ళని చూసి మిగతా భర్తలు నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

Show comments