iDreamPost
android-app
ios-app

కొత్తగా పెళ్లైన జంట! భర్తని తలుచుకుంటూ భార్య రోదిస్తూ..!

మూడు నెలల క్రితమే వారిద్దరికీ వివాహం జరిగింది. ఆనందంగా సాగిపోతోంది సంసారం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కొత్త జంటను చూసి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు.. అంతలో..

మూడు నెలల క్రితమే వారిద్దరికీ వివాహం జరిగింది. ఆనందంగా సాగిపోతోంది సంసారం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కొత్త జంటను చూసి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు.. అంతలో..

కొత్తగా పెళ్లైన జంట! భర్తని తలుచుకుంటూ భార్య  రోదిస్తూ..!

ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఆ ఇద్దరు. మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ కొద్ది రోజుల్లోనే వీరి బంధం బలపడింది. భర్త అంటే అమితమైన ప్రేమను పెంచుకుంది ఇల్లాలు. భర్త కూడా భార్య అడిగిందల్లా కాదనకుండా తెచ్చి ఇస్తున్నాడు. అన్యోన్యంగా సాగిపోతున్న సంసారంలో ఏ కన్ను కుట్టిందో తెలియదు కానీ.. సరదాగా విహారానికి వెళ్లిన ఈ జంట.. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల్ని శోక సంద్రంలో మునిగేలా చేసింది. ముద్దు ముచ్చట తీరకుండానే.. ఇద్దరు ఒకరి వెంట మరొకరు ప్రాణాలు వదిలారు. ఇంతకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అభిషేక్ అహ్లువాలి (25), అంజలి (22)కి గత నవంబర్ 30వ తేదీన వివాహం జరిగింది. ఎంతో ముచ్చటైన జంట అని మురిసిపోయారు తల్లిదండ్రులు. ఆ ఆనందం ఎన్ని రోజులు మిగల్లేదు. సోమవారం ఢిల్లీలోని జూను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. అక్కడకు వెళ్లాక.. అనుకోకుండా అభిషేక్ ఛాతీలో నొప్పి అనిపించగా.. అంజలి తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించింది. వెంటనే భర్తను గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం సఫ్టర్ జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కాగా,హార్ట్ ఎటాక్ కారణంగా అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో షాక్ కు గురైంది ఆ ఇల్లాలు.

అభిషేక్ మృతదేహాన్ని సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఘజియాబాద్‌లోని వారు నివాసముంటున్న అహ్ల్కాన్ అపార్ట్ మెంట్‌కు తీసుకు వచ్చారు. అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది భార్య అంజలి. భర్త మృతదేహాన్ని చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ప్రాణంగా ప్రేమించిన భర్త ఇక లేడని తెలిశాక తట్టుకోలేకపోయింది. వెంటనే లేచి బాల్కనీ వైపు పరుగెత్తి..వారుంటున్న అపార్ట్ మెంట్ ఏడో అంతస్తు నుండి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన అంజలిని వైశాలిలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం పొద్దున్న చనిపోయింది. భార్యా భర్తలిద్దరూ 24 గంటల్లోనే చనిపోవడంతో.. వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.