ఛార్జింగ్‌ పెడుతుండగా పేలిన బ్యాటరీ.. ఏడుగురి మృతి!

తరుచూ ఈ మధ్య ఎక్కడ చూసిన ఎలక్ట్రికల్ వస్తువుల పేలుడు ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా వాటిలో సెల్ ఫోన్ , ఎలక్ట్రిక్‌ స్కూటర్స్, రిఫ్రిజరేటర్స్, వాషింగ్ మిషన్స్ వంటివి పేలుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా మరోసారి ఓ షాపులో ఛార్జింగ్ పెడుతుండగా.. బ్యాటరీ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది.

తరుచూ ఈ మధ్య ఎక్కడ చూసిన ఎలక్ట్రికల్ వస్తువుల పేలుడు ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా వాటిలో సెల్ ఫోన్ , ఎలక్ట్రిక్‌ స్కూటర్స్, రిఫ్రిజరేటర్స్, వాషింగ్ మిషన్స్ వంటివి పేలుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా మరోసారి ఓ షాపులో ఛార్జింగ్ పెడుతుండగా.. బ్యాటరీ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది.

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన ఎలక్ట్రికల్ వస్తువుల పేలుడు ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ , ఎలక్ట్రిక్‌ స్కూటర్స్, రిఫ్రిజరేటర్స్, వాషింగ్ మిషన్స్ వంటి తరుచూ పేలుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర గాయలు పాలవ్వడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్ట్రికల్ వస్తువులను ఎక్కువ సమయం ఛార్జింగ్ పెట్టి వదిలయడం లేక, బ్యాటరీలో లోపం సంభవించడం వలన ఇలాంటి పేలుడు ఘటనలు ఏర్పడుతున్నాయి. తాజాగా మరోసారి ఓ షాపులో ఛార్జింగ్ పెడుతుండగా.. బ్యాటరీ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా షాపు మొత్తం మంటలు చెలరేగాయి. ఇంతకి ఎక్కడంటే..

మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లో నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఘోరం ప్రమాదం జరిగింది. ఓ బట్టల షాపులో మంటలు చెలరేగడంతో ఒక కుటుంబానకి చెందిన ఏడుగురు ఊపిరాడక మృతి చెందారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. అస్లాం టైలర్ అనే దుకాణంలో బుధవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో పేలుడు జరగడంతో షాపులో భారీగా మంటలు చెలరేగాయి. అయితే బట్టల దుకాణం కావడంతో మంటలు అమంతంగా వ్యాపించడంతో ఆ మంటల్లో ఇద్దరు మృతి చెందారు. అలాగే ఘటనలో ఆ దుకాణం పై అంతస్తులో ఉన్న మరో ఏడుగురు ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందారు. కాగా, మృతుల్లో.. అసిమ్ వసీం, షఏక్ పారీ వాసిం షేక్, వసీం షేక్ (30) , తన్వీర్(23) అనే మహిళ, హమీదా బేగం(50), షేక్ సోహైల్(35), రేష్మా షేక్ (22) ఉన్నారు. ఇక ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కాగా, బట్టల షాపులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఘటన గల కారణం బ్యాటరీ ఉన్న రిక్షా ఛార్జింగ్ లో పెట్టడంతోనే పేలుడు ఏర్పడిందని అనుమానపడుతున్నారు

అయితే ఈ ఘటన చావానీ దానా బజార్ గల్లీలోని మహావీర్ జైన్ టెంపుల్ పక్కనే ఈ క్లాత్ షాప్ లో జరిగింది. కాగా, మూడంతస్తుల భవనం అయిన ఈ బట్టల దుకాణంలో మొత్తం 16 మంది ఉన్నారు. ఇక మొదటి అంతస్తులో ఏడుగురు నివసిస్తుండగా.. రెండవ అంతస్తులోనూ మరో ఏడుగురు, మూడవ అంతస్తులో మరో ఇద్దరు ఉంటున్నారని తెలిసింది. ఈ షాపులో మంటలు చెలరేగడంతో రెండో అంతస్తులో ఉన్న ఏడుగురూ చనిపోయాగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.క్షతగాత్రులను కాపాడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక దురదృష్టవశాత్తు మరణించిన మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. మరి, ఛార్జీంగ్ పెడుతుండగా బ్యాటరీ పేలుడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments