iDreamPost
android-app
ios-app

ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు!

  • Published May 25, 2024 | 7:36 PM Updated Updated May 25, 2024 | 7:36 PM

How To Book Train Ticket Before 5 Mins: ప్రయాణానికి 5 నిమిషాలు ఉందనగా కూడా మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కాలనుకున్న ట్రైన్ లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో ఫోన్ లో యాప్ ద్వారా తెలుసుకుని కూడా బుక్ చేసుకోవచ్చు. ఎలా అంటే?

How To Book Train Ticket Before 5 Mins: ప్రయాణానికి 5 నిమిషాలు ఉందనగా కూడా మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కాలనుకున్న ట్రైన్ లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో ఫోన్ లో యాప్ ద్వారా తెలుసుకుని కూడా బుక్ చేసుకోవచ్చు. ఎలా అంటే?

ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు!

దూర ప్రయాణాలు చేసేవారు ఖచ్చితంగా ఒకరోజు ముందు అయినా టికెట్ బుక్ చేసుకోవాలి. రైలు ప్రయాణాలు చేసేవారు అయితే సీటు రిజర్వ్ చేసుకోవాలన్నా, బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నా 10, 15 రోజుల ముందు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీప్లాన్డ్ ప్రయాణాలు చేసేవారు ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ కొంతమంది అప్పటికప్పుడు ప్రయాణం చేయవలసి ఉంటుంది. బస్సులు అందుబాటులో ఉండకపోవచ్చు. రైళ్లు ఉంటాయి కానీ సీటు ఖాళీ ఉండదు. పైగా టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఒకరోజు ముందు అంటే తత్కాల్ లో బుక్ చేసుకుని వెళ్ళచ్చు. కానీ మరీ ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే సాధ్యమేనా అంటే సాధ్యమే. రైల్వేస్టేషన్ కి వెళ్లిన తర్వాత వచ్చే రైలుని బట్టి ఆ ట్రైన్ లో సీటు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదెలాగంటే?

వివిధ కారణాల వల్ల ప్రయాణం చేయవలసిన రోజున టికెట్ క్యాన్సిల్ చేసుకునేవారు ఉంటారు. క్యాన్సిల్ అయిన టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రతీ రైలు టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే శాఖ రెండు చార్టులను రెడీ చేస్తుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు ఫస్ట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. రెండో చార్ట్ ని మాత్రం రైలు బయలుదేరే ముందు రెడీ చేస్తారు. గతంలో రైలు బయలుదేరడానికి అరగంట ముందు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవడానికి వీలు ఉండేది. కానీ ఇప్పుడు రైలు బయలుదేరే 5 నిమిషాల ముందు కూడా బుక్ చేసుకునే వీలు కల్పిస్తుంది రైల్వే శాఖ. ఆఫ్ లైన్ లో లేదా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. 

ఆన్ లైన్ లో 5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోండిలా:

రైల్వేస్టేషన్ కి వెళ్ళాక మీరు ఎక్కాలనుకున్న ట్రైన్ లో సీట్లు ఖాళీగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. రైల్వేశాఖ ప్రిపేర్ చేసిన ఆన్ లైన్ చార్ట్ ద్వారా ట్రైన్ లో సీట్లు ఖాళీగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్ పై క్లిక్ చేస్తే.. చార్ట్ వేకెన్సీ అనేది ఓపెన్ అవుతుంది. లేదా ఆన్ లైన్ ఛార్ట్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ట్రైన్ పేరు లేదా ట్రైన్ నంబర్, తేదీ, ఏ స్టేషన్ లో ఎక్కుతారో ఆ స్టేషన్ పేరు ఎంటర్ చేసి గెట్ ట్రైన్ చార్ట్ పై క్లిక్ చేయాలి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్, స్లీపర్ ఇలా తరగతుల వారీగా ఒక చార్ట్ కనిపిస్తుంది. అందులో సీట్లు ఏమైనా ఖాళీగా ఉంటే కనుక టికెట్ బుక్ చేసుకోవచ్చు. సీట్లు లేకపోతే చార్ట్ లో సున్నా అని చూపిస్తుంది. కోచ్ నంబర్, బెర్త్ సహా అన్ని వివరాలు ఆ చార్ట్ లో కనిపిస్తాయి. రైల్వేస్టేషన్ లో ఉండగా ట్రైన్ వచ్చే 5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది.