ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు ముఖ్యమంత్రులు. రాష్ట్రంలోని ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తుంటారు. దీంతో ఒక్కొక్కసారి తమ ఆరోగ్యంపై అశ్రద్ధ చూపుతుంటారు. దీంతో అస్వస్థతకు గురి అవుతుంటారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు ముఖ్యమంత్రులు. రాష్ట్రంలోని ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తుంటారు. దీంతో ఒక్కొక్కసారి తమ ఆరోగ్యంపై అశ్రద్ధ చూపుతుంటారు. దీంతో అస్వస్థతకు గురి అవుతుంటారు.

రాజకీయాలు అంటేనే ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ముఖ్యమంత్రి పదవి అంటే నిప్పుల కుంపటే. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి జవాబు దారీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉండాలి. అందుకే రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తూనే ఉంటారు. చాలా వరకు ముఖ్యమంత్రులు 50 ఏళ్లకు పైబడిన వారే ఉంటారు. ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ.. అప్పుడుప్పుడు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు.

వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం సీఎంను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ డాక్టర్ రాహుల్ రావు మాట్లాడుతూ.. బుధవారం రాత్రి సుఖ్విందర్ అస్వస్థతకు గురయ్యారని, పొత్తికడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. బుధవారం రాత్రి అన్ని పరీక్షలు చేశామని, కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, మరిన్ని వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. కొన్ని రోజుల నుండి సీఎం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారని, ఈ క్రమంలో బయట ఆహారం తీసుకోవాల్సి వచ్చిందని సుఖు ప్రధాన మీడియా సలహాదారు పేర్కొన్నారు.

బయట ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. దీంతో బుధవారం తీవ్ర కడుపునొప్పితో బాధ పడినట్లు వెల్లడించారు. వెంటనే సిమ్లా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.  ప్రస్తుతం ముఖ్యమంత్రి సుఖు పరిస్థితి నిలకడగా ఉందని, అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. సిమ్లాలో సీఎంను పరీక్షించిన వైద్య బృందం ఆయనతో పాటు ఢిల్లీ వెళ్లింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడినట్లు తెలుస్తోంది.

Show comments