Krishna Kowshik
ఇటీవల దేశ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్థం అవుతుంది. ఎడతెరిపి లేకుండా వానలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా బెంగాల్ ను వర్షాలు వణికించాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్థం అవుతుంది. ఎడతెరిపి లేకుండా వానలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా బెంగాల్ ను వర్షాలు వణికించాయి.
Krishna Kowshik
దేశ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. జలశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో వైపు పెను విపత్తులు సంభవిస్తున్నాయి. కేరళలో వానలు, వరదలకు కొండచరియలు విరిగిపడి సుమారు 340 మంది మరణించారు. మరో వైపు హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ జరిగి.. 10 మంది మరణించగా.. సుమారు 50 మంది గ ల్లంతు అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ను ముంచెత్తాయి వర్షాలు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారడంతో శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ రాజధాని నగరి కోల్‌కతా, దాని పొరుగు జిల్లాలను ముంచెత్తాయి. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
కోల్‌కతాలోని వివిధ ప్రాంతాలతో పాటు సమీపంలోని హౌరా, సాల్ట్ లేక్, బరాక్ పూర్ నగరాల్లో విపరీతంగా వానలు కురిశాయి. కుండపోతగా వర్షం పడటంతో జన జీవనం అస్తవ్యస్థం అయ్యింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా కోల్‌కతాలోని నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నీట మునిగింది. రన్ వే పై నీరు నిలిచిపోయింది. రన్ వేపై మోకాళ్ల లోతులో నీరు చేరి.. విమాన రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. రన్ వేపై వరద నీటిలోనే ఉన్నాయి విమానాలను నిలిపి ఉంచడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఎయిర్ పోర్టులో వరదలు ముంచెత్తడంతో ప్రయాణీకులు అవస్థలు పుడుతున్నారు.
అలాగే విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై కూడా భారీ ట్రాఫిక్ నెలకొంది. అయితే విమాన సర్వీసులు యథావిధిగానే రాకపోకలు సాగిస్తున్నాయి. శుక్రవారం నుండి పశ్చిమ బెంగాల్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. అలాగే ఇంకా వానలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాది జిల్లాలైన హౌరా, పశ్చిమ్ బర్ధమాన్, బీర్భూమ్, పుర్బా బర్ధమాన్, హుగ్లీ, నదియా, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో రానున్న 12 గంటల్లో వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లోని గంగానది ప్రవహించే జిల్లాల్లో 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అంతే కాకుండా పలు రాష్ట్రాల్లో వానలు కురుస్తూనే ఉన్నాయి.
VIDEO | Heavy rainfall causes waterlogging on the runway of Netaji Subhash Chandra Bose International Airport in Kolkata, West Bengal.
(Source: Third Party) pic.twitter.com/CDGEEHOYT7
— Press Trust of India (@PTI_News) August 3, 2024