బ్రేకింగ్: చివరి రౌండ్ వరకు తీవ్ర ఉత్కంఠ.. వినేష్ ఫొగట్ ఘన విజయం!

Haryana Assembly Election Results 2024: ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో అందివచ్చిన పతకాన్ని తృటిలో చేజార్చుకున్న ప్రముఖ రెజ్లర్ వినేశ్‌ ఫొగట్‌ రాజకీయా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. హార్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జులానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.

Haryana Assembly Election Results 2024: ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో అందివచ్చిన పతకాన్ని తృటిలో చేజార్చుకున్న ప్రముఖ రెజ్లర్ వినేశ్‌ ఫొగట్‌ రాజకీయా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. హార్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జులానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.

పారిస్ ఒలింపిక్స్ లో మహిళల రెజ్లింగ్ విభాగంలో వినేశ్‌ ఫొగట్‌ చివరి వరకు ఎంతో పోరాడింది. తుది పోరులో తలపడాల్సిన సమయంలో అనూహ్యంగా అధిక బరువు కారణంతో ఆమె పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమెకు ఎంతోమంది క్రీడాకారులు, సెలబ్రెటీలు మద్దతు పలికారు. స్వదేశం చేరుకున్న వినేశ్‌ ఫొగట్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జులానా అసెంబ్లీ స్థానానికి తొలిసారిగా పోటీ చేయగా ఇక్కడి ఓటర్లు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఎంతో ఉత్కంఠంగా సాగిన పోరులో వినేశ్‌ ఫొగట్‌ విజయం సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానా ఎన్నికల్లో ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. మొన్నటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సహా.. దేశంలోని చాలా మంది ఊహించినట్లు అక్కడ రిజల్ట్స్ తారు మారు అయ్యాయి. భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేశ్ ఫొగట్ జులానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా ఆమె మాత్రం గెలవడం గమనార్హం. ఒలింపిక్స్ లో వెంటాడిన దురదృష్టం.. రాజకీయాల్లో అదృష్టంగా మారిందని అంటున్నారు. ఫలితాల్లో ఫస్ట్ రౌండ్ లో వినేశ్ ఫొగట్ ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. మధ్యలో కొంత వెనుక బడిన తర్వాత మళ్లీ పుంజుకుంది. చివరి రౌండ్ వరకు ఆమె ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. బీజేపీ తరుపు యోగేశ్ బజ్‌రంగి పై విజయం సాధించారు.

హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన ఒకే విడతలో 90 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఈ రోజు మంగళవారం (అక్టోబర్ 8) ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లలతో కౌంటింగ్ మొదలైంది. కాంగ్రెస్ తరుపున జులానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.   మొత్తానికి ప్రత్యర్థిపై ఆమె 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఫొగట్ గెలుపు అంత సులభంగా లేదు. రౌండ్ రౌండ్ కి ఫలితాలు తారుమారవుతూ వచ్చాయి. ఒక దశంలో ఆమె ఓడిపోతారని ప్రచారం కూడా వినిపించింది. చివరి ఐదు రౌండ్లలో అనూహ్యంగా ఆమె పుంజుకొని లీడ్ లోకి వచ్చారు. మొత్తం 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో వినేశ్ ఫోగట్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చి ఉంటే ఆమెకు తప్పకుండా మంత్రి పదవి దక్కి ఉండేదని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఒలింపిక్స్ లో మెడల్ ని కోల్పోయిన ఆమెకు ఓటర్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చి గౌరవించారు. ఈ సందర్బంగా వినేశ్ ఫొగట్ మాట్లాడుతూ..‘నాపై నమ్మకాన్ని ఉంచి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ఓటర్లకు జీవితాంతం రుణపడి ఉంటా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా పక్షాన పోరాడుతా.. వారి సమస్యలను అధికార పక్షం దృష్టికి తీసుకువెళ్తా’ అని అన్నారు.

Show comments