iDreamPost
android-app
ios-app

టోల్ ప్లాజా సిబ్బందిని కారుతో తొక్కించిన డ్రైవర్.. పరిస్థితి విషమం!

టోల్ ప్లాజా సిబ్బందిని కారుతో తొక్కించిన డ్రైవర్.. పరిస్థితి విషమం!

సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మీరు ఆ దారిలో ప్రయాణం చేస్తున్నందుకు మీరు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాజకీయ నేతలు, కొందరు అధికారులకు మాత్రం ఈ టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. వారు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, మిగిలిన వాళ్లు అందరూ కూడా టోల్ ఫీజు కట్టాల్సిందే. అందుకు అక్కడ యంత్రాగం, సిబ్బంది, ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఈ టోల్ ఫీజు విషయంలో చాలాచోట్ల దాడులు, గొడవలు జరగడం చూశాం. తాజాగా అలాంటి ఒక ఘోరం వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్ హాపూర్ లోని ఢిల్లీ- లక్నో హైవేపై ఉన్న ఛాజార్సీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఎప్పటిలాగానే వాహనదారుల వద్ద టోల్ వసూలు చేస్తున్నారు. ఒక కారు అక్కడకు వచ్చింది. అతను టోల్ కట్టేందుకు నిరాకరించాడు. అంతేకాకుండా తన కారుతో టోల్ బూత్ దాటి వెళ్లిపోయాడు. అతని కారు వెనకాల ఒక టోల్ ప్లాజా సిబ్బంది వెంబడించాడు. అతను వేగంగా కారు వెనకాల పరిగెత్తుకుంటూ వాళ్లాడు. అయితే అది గమనించిన కారు డ్రైవర్ కు చిర్రెత్తుకొచ్చింది. తన కారుని వెంబడించాడని భావించిన అతను కోపంతో కారుని యూటర్న్ తిప్పాడు. వెంటనే ఆ టోల్ సిబ్బంది మీదకు కారుతో దూసుకొచ్చాడు. అక్కడే నిల్చుని ఉన్న అతనిపైకి కారుని పోనిచ్చాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. బాధితుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు.

ఈ ఘటనపై హర్పూర్ డీఎస్పీ స్పందించారు. “మాకు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందింది. ఈ ఘటన పిలాఖువా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కారుతో టోల్ సిబ్బందిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో టోల్ ప్లాజా ఉద్యోగికి బాగా గాయాలు అయ్యాయి. అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ పై ఐపీసీ లో ఉన్న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఆ కారు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు” అంటూ డీఎస్పీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. టోల్ కట్టమని అడిగినందుకు టోల్ బూతులోకి వెళ్లి సిబ్బందిని కొట్టిన ఘటనలు కూడా చాలానే జరిగాయి. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనను అస్సలు ఉపేక్షించకూడదని వాపోతున్నారు. ఇలాగే జరిగితే టోల్ ప్లాజా ఉద్యోగులకు ప్రాణాలకు ఎవరు రక్షణ కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. దాడికి గురైన ఉద్యోగి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి