Arjun Suravaram
వైద్యం కోసం వచ్చే రోగులకు డాక్టర్లు తప్పనసరిగా చికిత్స చేయాలి. అయితే, కొన్ని సందర్భాల్లో వైద్యం చేయడానికి నిరాకరిస్తే.. న్యాయపరంగా చిక్కులు కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే, ఓ గైనకాలజిస్ట్.. తన వద్ద చికిత్స కోసం వచ్చిన గర్భిణికి చికిత్సను నిరాకరించారు.
వైద్యం కోసం వచ్చే రోగులకు డాక్టర్లు తప్పనసరిగా చికిత్స చేయాలి. అయితే, కొన్ని సందర్భాల్లో వైద్యం చేయడానికి నిరాకరిస్తే.. న్యాయపరంగా చిక్కులు కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే, ఓ గైనకాలజిస్ట్.. తన వద్ద చికిత్స కోసం వచ్చిన గర్భిణికి చికిత్సను నిరాకరించారు.
Arjun Suravaram
ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్తుంటాము. అలానే వైద్యులు కూడా రోగిని పరీక్షించి.. వారికి అవసరమైన చికిత్స అందిస్తుంటారు. ఇక అనారోగ్యం, ఇతర సమస్యలతో వచ్చిన వారికి వైద్యులు కాదనకుండా చికిత్స చేస్తుంటారు. అయితే ఓ వైద్యుడు మాత్రం గర్భిణీకి చికిత్స చేసేందుకు నిరాకరించాడు. ఆ మహిళకు ట్రీట్మెంట్ చేయకపోవడానికి గల కారణాలను ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు. ఆయన చెప్పిన కారణాలపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతానికి చెందిన రాజేశ్ పారిఖ్ అనే గైనకాలజిస్ట్ ఉన్నారు. 30 ఏళ్ల గర్బిణీ చికిత్స నిమిత్తం ఈ వైద్యుడి వద్దకు వచ్చింది. అయితే చికిత్సకు సంబంధించిన పలు పరీక్షలు చేయించుకోవాలని ఆ డాక్టర్..ఆ మహిళకు సూచించారు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఆ వైద్యుడు కూడా తాను చెప్పిన పరీక్షలు చేయుంచుకోవడానికి నిరాకరించిందని చికిత్స చేసేందుకు ఒప్పుకోలేదు. తాను చేసిన ఈ పనిని రాజేశ్ పారిఖ్ ‘ఎక్స్’లో కూడా పోస్ట్ పెట్టారు. వేరే వైద్యుడి వద్దకు వెళ్లమని సూచించాడు.
అయితే అత్యవసర పరిస్థితుల్లో రోగులు తమ ఎక్కడ అనుకూలంగా ఉంటే.. ఆ వైద్యుడి వద్దకు వెళ్లే హక్కు ఉంది. అదే విషయాన్ని సదరు వైద్యుడు ప్రస్తావిస్తూ.. రోగులకు ఎలాగైతే తమ వైద్యుడిని ఎంచుకునే హక్కు ఉందో.. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగత సమయంలో పేషెంట్లకు చికిత్స ను తిరష్కరించే హక్కు వైద్యులకు ఉందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకోనందున ఆ మహిళకు చికిత్స అందించలేదని చెప్పారు. వైద్యం గురించి అవగాహన లేని తన స్నేహితులు చెప్పిన మాటలు విని సదరు మహిళ ఎన్‌టీ స్కానింగ్, డబుల్ మార్కర్ పరీక్ష చేయించుకోలేదని ఆయన తెలిపారు. చికిత్స అందించమని ఆమె పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, మరో వైద్యుడిని చూసుకోవాలని సలహా ఇచ్చానని రాజేశ్ పారిఖ్ వెల్లడించారు.
ఇక రాజేశ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వైద్యులు, ప్రత్యేకించి గైనకాలజిస్టుగా రోగులకు ఎప్పుడూ చికిత్స నిరాకరించకూడదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరొకరు మాత్రం వైద్యుడ్ని సమర్థిస్తూ.. అవసరమైతేనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారని తెలిపాడు. ఇలా సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు రోగికి మద్దతు, మరికొందరు వైద్యుడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సదరు వైద్యుడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..వైద్యుడు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Just as patients have a right to choose their doctors, doctors have the right to refuse treatment, except in emergencies. I turned away a pregnant patient in her 30s who, ignoring medical advice, refused an NT scan and double marker test (crucial to rule out common chromosomal…
— 𝙍𝘼𝙅𝙀𝙎𝙃 𝙋𝘼𝙍𝙄𝙆𝙃 (@imacuriosguy) April 22, 2024