Train Ticket: ఇకపై ఆ ఉద్యోగులు కూడా టికెట్ తీసుకోవాల్సిందే : రైల్వే

ఇకపై ఆ ఉద్యోగులు కూడా టికెట్ తీసుకోవాల్సిందే : రైల్వే

Train Ticket: భారతీయ రైల్వే అతి పెద్ద రవాణా వ్యవస్థ అంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణాలు చేయడానికి సుముఖత చూపుతుంటారు.స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి.

Train Ticket: భారతీయ రైల్వే అతి పెద్ద రవాణా వ్యవస్థ అంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణాలు చేయడానికి సుముఖత చూపుతుంటారు.స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి.

ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది భారత రైల్వే. ప్రతిరోజూ భారతీయ రైల్వేల ద్వారా లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. బస్సు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో టికెట్ ధరల కన్నా తక్కువ ధర, సౌకర్య వంతంగా ఉంటాయి కనుకనే రైల్వే ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులతో ప్రతి నిత్యం రైల్వేలు కిట కిటలాడుతాయి.  ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు చాలా వరకు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. కొంతమంది రైలు టికెట్ లేకుండానే ప్రయాణాలు చేస్తుంటారు.. రైల్వే అధికారులకు దొరికిపోయి జరిమానా కడుతుంటారు. తాజాగా రైల్వే ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది రైల్వే. పూర్తి వివరాల్లోకి వెళితే..

రైల్వే ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది రైల్వేశాఖ. ఇకపై విధుల్లో భాగంగా రైళ్లలో ప్రయాణించే గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) సిబ్బంది తప్పని సరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఐడీ కార్డుతో ప్రయాణించి విధుల్లో ఉన్నామంటే అది చెల్లుబాటు కాదని పేర్కొంది. ఇటీవల ఓ రైల్వే కానిస్టేబుల్ తాను విధుల్లో ఉన్న సమయంలో కాలు జారి కిందపడ్డానని, ఒక కాలు కోల్పోయినందుకు నష్టపరిహారం చెల్లించాలని దాఖలు చేసిన పిటీషన్ ను ‘రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్’ కొట్టిపడేసింది. కారణం.. ఆ ఉద్యోగి వద్ద ట్రావెల్ అథారిటీ లేదా రైలు టికెట్ లేకపోవం వల్ల పరిహారానికి అర్హుడు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమ్మదాబాద్ బెంచ్.. రైల్వే శాఖకు స్పష్టం చేసింది.

రాజేశ్ బగుల్ అనే జీఆర్‌పీ కానిస్టేబుల్ తాను విధుల్లో ఉండగా జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయానని.. తనకు వడ్డీతో సహా మొత్తం రూ.8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ట్రిబ్యూనల్ ను ఆశ్రయించాడు. నవంబర్ 13, 2013 లో విధుల్లో భాగంగా సూరత్ రైల్వే పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు తెలిపారు. సూరత్ నుంచి తిరిగి సూరత్ – జామ్ నగర్ ఇంటర్ సిటీ ట్రైన్ లో బరూచ్‌కి వెళ్తున్న సమయంలో పాలేజ్ స్టేషన్ దాటిన తర్వాత ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరిగిందని వివరించాడు. రాజేశ్ వాదనలు నిరూపించే డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు లేవని రైల్వే వాదించింది. స్టేషన్ ను దాటిన తర్వాత రైలు దిగేందుకు ప్రయత్నిస్తుండగా జారి పడ్డాడని రైల్వే పేర్కొంది.

ఇరువురి వాదనలు విన్న ట్రిబ్యూనల్ సభ్యులు (జుడీషియల్) వినయో గోయెల్.. రాజేశ్ తాను అధికారిక ప్రయాణం చేసినట్లు నిరూపించడానికి సరైన ప్రయాణ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఆధారాలు అందించడంలో రాజేశ్ విఫలం కావడంత వల్ల పిటీషన్ కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు. సరైన చెల్లుబాటు అయ్యే ట్రావెల్ అథారిటీ లేని పిటీషనర్ ని ప్యాసింజర్ గా గుర్తించలేమని స్పష్టం చేసింది. తరుచూ రైలు ప్రయాణాలు చేసే రైల్వే సిబ్బంది డ్యూటీ కార్డు పాస్ ల విషయంలో రైల్వే నిర్లక్ష వైఖరిని ప్రదర్శిస్తుందని, సంబంధితన సర్క్యూలర్ ను జారీ చేయడం అలసత్వం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సర్క్యూలర్ ను జారీ చేయాలని పేర్కొంది.

Show comments