iDreamPost
android-app
ios-app

గొప్పోడివి సామి.. కట్నంగా లక్షలు ఇస్తున్నా కాదని.. రూపాయి తీసుకుని కొడుకుకు పెళ్లి

ఓ రాజకీయ నాయకుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కుమారుడి పెళ్లి సందర్భంగా లక్షల రూపాయల కట్నాన్నికాదని కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని కొడుకు పెళ్ళి జరిపించారు.

ఓ రాజకీయ నాయకుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కుమారుడి పెళ్లి సందర్భంగా లక్షల రూపాయల కట్నాన్నికాదని కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని కొడుకు పెళ్ళి జరిపించారు.

గొప్పోడివి సామి.. కట్నంగా లక్షలు ఇస్తున్నా కాదని.. రూపాయి తీసుకుని కొడుకుకు పెళ్లి

పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ కూడా పేద, మధ్య తరగతి వారికి నానాటికీ భారంగానే మారుతున్నాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే కన్నవారికి కష్టాలు తప్పడం లేదు. పెళ్లి చేయాలంటే వివాహ వేదిక దగ్గర్నుంచి మొదలుకొని వింధు భోజనాలు, ఫోటోలు, వీడియోలకు బోలెడంత ఖర్చవుతుంది. ఇదీకాక కట్నంగా లక్షల రూపాయలు, బంగారం, స్థలాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మరి నేటి రోజుల్లో కట్నం తీసకోని వారు ఎవరైనా ఉన్నారా అంటే భూతద్దంలో పెట్టి వెతికినా దొరకరేమో కదా. కానీ ఓ రాజకీయ నాయకుడు మాత్రం లక్షల రూపాయలు కట్నంగా వస్తున్నా కాదని.. ఒక్క రూపాయి మాత్రమే కట్నంగా తీసుకుని తన కుమారుడికి వివాహం జరిపించారు. ఇది తెలిసిన వారు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

హరియాణా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత కృష్ణ చౌకర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కుమారుడి పెళ్లికి వధువు తండ్రి నుంచి కేవలం రూపాయి మాత్రమే కట్నం తీసుకుని తన గొప్ప తనాన్ని చాటుకున్నారు. చౌకర్ కుమారుడు గౌరవ్‌ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి హరియాణా రాష్ట్ర స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ భూపాల్‌ సింగ్‌ ఖాద్రీ కుమార్తె గరిమాతో పెళ్లితో జరిపించారు. ఈ వివాహ వేడుకకు అతిరథ మహారథులు హాజరవ్వగా అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక ఈ పెళ్లిలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వధువు తండ్రి భూపాల్‌ సింగ్‌ బంధువులందరి ముందు వరుడికి రూ.7 లక్షలకు పైగా కట్నంగా అందించారు. ఆ సమయంలో వరుడు తండ్రి కృష్ణ చౌకర్‌ కట్నాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. లక్షల రూపాయల్లో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగిలిన సొమ్మంతా వెనక్కి ఇచ్చేశారు. వరుడు తండ్రి చేసిన ఈ పనికి అక్కడికి వచ్చిన అతిథులు ప్రశంసల్లో ముంచెత్తారు. మీరు గొప్పొల్లు సామీ అంటూ కామెంట్ చేస్తున్నారు.