Venkateswarlu
Venkateswarlu
టెక్నాలజీ వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. తాజాగా, జీపీఎస్ కారణంగా ఓ ఇద్దరు డాక్టర్లు బలయ్యారు. సరైన రూటు కోసం వారు దాన్ని వాడగా.. అది కాస్తా వారిని పరలోకానికి తీసుకెళ్లిపోయింది. వారు వెళుతున్న కారు నీళ్లలోకి దూసుకెళ్లటంతో వారు చనిపోయారు. ఈ సంఘటన కేరళలోని ఎర్నాకులంలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళకు చెందిన అద్వైత్, అజ్మల్ అసిఫ్‌తో పాటు మరికొంతమంది యువ డాక్టర్లు శనివారం కొడుంగలూర్ నుంచి కొచ్చీకి కారులో బయలు దేరారు.
బర్త్‌డే షాకింగ్ కోసం వారు కొచ్చి బయలు దేరారు. వారు వెళ్లాల్సిన రూటు తెలియకపోవటంతో జీపీఎస్ ఆన్ చేసుకుని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారి కారు అనుకోని విధంగా ఒక్కసారిగా నీళ్లలోకి దూసుకెళ్లింది. దీంతో కారు నీళ్లలో మునిగిపోయింది. అద్వైత్, అజ్మల్ అసిఫ్ తప్ప మిగిలిన వారు ఎలాగోలా బయటకు తప్పించుకుని వచ్చారు. పాపం వారిద్దరూ లోపలే నీట మునిగి చనిపోయారు. మిగిలిన వారు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును బయటకు తీసుకువచ్చారు. కారులో ఉన్న ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జీపీఎస్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్న దానిపై క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం నుంచి బయట పడ్డ వారినుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. మరి, జీపీఎస్ కారణంగా ఓ ఇద్దరు డాక్టర్లు బలవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.