iDreamPost
android-app
ios-app

ఈ కార్లు కొన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రోడ్ ట్యాక్స్ లేదు

  • Published Jul 09, 2024 | 9:54 PM Updated Updated Jul 09, 2024 | 9:54 PM

No Road Tax For These Cars: ఏ వాహనానికైనా రోడ్ ట్యాక్స్ అనేది చెల్లించాలి. బండి ధరను బట్టి రోడ్ ట్యాక్స్ అనేది ఆధారపడి ఉంటుంది. తాజాగా ఈ కార్లు కొనేవారికి రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

No Road Tax For These Cars: ఏ వాహనానికైనా రోడ్ ట్యాక్స్ అనేది చెల్లించాలి. బండి ధరను బట్టి రోడ్ ట్యాక్స్ అనేది ఆధారపడి ఉంటుంది. తాజాగా ఈ కార్లు కొనేవారికి రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

ఈ కార్లు కొన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రోడ్ ట్యాక్స్ లేదు

ఏ వాహనం కొన్నా గానీ రోడ్ ట్యాక్స్ అనేది చెల్లించక తప్పదు. అవి పెట్రోల్ వాహనాలైనా, డీజిల్ వాహనాలైన, ఎలక్ట్రిక్ వాహనాలైనా ఏ వాహనాలైనా గానీ రోడ్ ట్యాక్స్ అనేది చెల్లించాల్సిందే. రాష్ట్రాలను బట్టి రోడ్ ట్యాక్స్ లో ఇంత శాతం అని ఉంటుంది. అలానే వాహనాల ధరలను బట్టి కూడా ఉంటుంది. టూవీలర్స్ తో పోలిస్తే కార్లు, బస్సులు, లారీలు వంటి ఫోర్ వీలర్స్ కి రోడ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి కార్లపై రోడ్ ట్యాక్స్ ని ఎత్తేసింది ప్రభుత్వం. మరి ఆ కార్ల జాబితాలో ఏ కార్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

మన దేశంలో ఇప్పటికే కొన్ని వాహన తయారీ కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. ఢిల్లీ ప్రభుత్వం అయితే డీజిల్ వాహనాల వినియోగాన్ని నిషేధించింది. దీనికి కారణం అక్కడి వాతావరణ కాలుష్యమే. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం ఎక్కువైపోతుండడంతో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆ రహస్త్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ ఉండదు. అంటే హైబ్రిడ్ కార్లను కొనేవారు రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. దీని వల్ల కస్టమర్ కే కాకుండా ఆ కార్ల తయారీ కంపెనీలు కూడా లాభపడనున్నాయి. ఈ కార్ల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోడ్ ట్యాక్స్ మినహాయింపు అనేది హైబ్రిడ్, హైబ్రిడ్ ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో మారుతీ సుజుకీ, టయోటా వంటి కంపెనీలు లాభపడనున్నాయి.

ఇప్పటికే  మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. తాజాగా యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ సేల్స్ మరింత పెరగనున్నాయి. మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ ధర ప్రస్తుతం యూపీలో 1.80 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఉంది. వేరియంట్ ని బట్టి ఈ ధర ఉంటుంది. అయితే ఇప్పుడు రోడ్ ట్యాక్స్ లేని కారణంగా కస్టమర్ కి 1.80 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఆదా అవుతుంది. అయితే హైబ్రిడ్ కార్ల మీద రోడ్ ట్యాక్స్ ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న యూపీ ప్రభుత్వం మాదిరి.. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యూపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానించే అవకాశం ఉంది. అదే జరిగితే హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరుగుతుంది. తద్వారా వాహన కాలుష్యం కూడా తగ్గుతుంది.