Vinay Kola
IRCTC: చాలా సార్లు ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లనేవి బుక్ అవ్వవు. ఈ పరిస్థితి మనల్ని నిరాశకు గురి చేస్తుంది. మాములుగా మనం టికెట్లను ఆన్లైన్ లో ఈజీగా బుక్ చేసుకుంటాము.
IRCTC: చాలా సార్లు ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లనేవి బుక్ అవ్వవు. ఈ పరిస్థితి మనల్ని నిరాశకు గురి చేస్తుంది. మాములుగా మనం టికెట్లను ఆన్లైన్ లో ఈజీగా బుక్ చేసుకుంటాము.
Vinay Kola
మనం చాలాసార్లు ఎలాంటి ప్లాన్ లేకుండా అకస్మాత్తుగా రైలులో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయాల్లో మనకు టిక్కెట్టు కావాలంటే కొంచెం కష్టం. ఆ పరిస్థితిలో తత్కాల్ టికెట్ బుకింగ్ తప్ప వేరే అవకాశం మనకు ఉండదు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ చాలా సార్లు ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లనేవి బుక్ అవ్వవు. దీనికి కారణం ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉండడం. ఈ పరిస్థితి మనల్ని కచ్చితంగా నిరాశకు గురి చేస్తుంది. మాములుగా మనం టికెట్లను ఆన్లైన్ లో చాలా ఈజీగా బుక్ చేసుకుంటాము. కానీ తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.
సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం, కొన్నిసార్లు చెల్లింపు ఎంపికకు వెళ్ళిన తర్వాత వెబ్‌సైట్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. చాలా సార్లు మనం టికెట్ బుక్ చేసుకుటప్పుడు ఆ సమయంలో టికెట్ అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది. కానీ బుకింగ్ ప్రాసెస్ అయ్యాక టికెట్ వెయిటింగ్‌గా మారుతుంది.ఈ సమస్యకి కారణం సర్వర్ హ్యాంగ్ అవ్వడం అని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలుపుతున్నారు. మనం బుక్ చేసుకునే వెబ్‌సైట్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఇందులో చాలా మంది వ్యక్తులు సర్వర్ కెపాసిటీకికి మించి టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్లనే మనకు ఇటువంటి సమస్యలు వస్తాయి. అయితే త్వరలో మనకు ఇలాంటి సమస్య రాదు. తొందర్లోనే ఇలాంటి సమస్యల నుంచి బయటపడబోతున్నాం.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) త్వరలో ఈ సమస్యని పూర్తిగా తీసేస్తుంది. అందుకోసం ఒక సౌకర్యాన్ని మనకు కల్పిస్తుంది. దీంతో మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఇంట్లో కూర్చుని తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది.ఎందుకంటే ఈ సమస్య రాకుండా సర్వర్ కెపాసిటీని పెంచుతున్నారు. ఈ ఇబ్బంది రాకుండా ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి సర్వర్ కెపాసిటీని పెంచే పనులు పూర్తి చేస్తారని తెలుస్తుంది. దీని వలన ఇక భవిష్యత్తులో తత్కాల్ టికెట్లను సులువుగా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు.