Gleeden App-Indian Marriage Relationship: మగాళ్లలో 60 శాతం మందికి వివాహేతర సంబంధాలు ఇష్టం: ఓ ఇంట్రెస్టింగ్ సర్వే

మగాళ్లలో 60 శాతం మందికి వివాహేతర సంబంధాలు ఇష్టం: ఓ ఇంట్రెస్టింగ్ సర్వే

ఓ డేటింగ్‌ యాప్‌ సంచలన విషయాలు వెల్లడించింది. భారతీయ వివాహ వ్యవస్థ మీద చేసిన ఈ సర్వేలో షాకింగ్‌ విషయాలు తెలిశాయి. ఆ వివరాలు..

ఓ డేటింగ్‌ యాప్‌ సంచలన విషయాలు వెల్లడించింది. భారతీయ వివాహ వ్యవస్థ మీద చేసిన ఈ సర్వేలో షాకింగ్‌ విషయాలు తెలిశాయి. ఆ వివరాలు..

పెళ్లై.. అనుకూలమైన భాగస్వామిని పొందినా సరే.. పక్క చూపులు చూసే వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇక సమాజంలో చోటు చేసుకునే చాలా నేరాలకు వివాహేతర సంబంధాలే కారణం. పెళ్లై, పిల్లలున్నా సరే.. పరాయి వ్యక్తి మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. దీని వల్ల వారి జీవితాలు నాశనం కావడం మాత్రమే కాక.. అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలు కూడా బలవుతున్నాయి. పాపం ఆ పసివాళ్ల బాల్యం, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇక ఓ పదేళ్లతో పోలిస్తే.. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ డేటింగ్‌ యాప్‌ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మనదేశంలో సగానికిపైగా పెళ్లైన మగాళ్లు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట. ఆ వివరాలు..

ప్రముఖ డేటింగ్‌ యాప్‌ గ్లీడెన్‌ వెల్లడించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారతీయులు వివాహేతర సంబంధాలపై చాలా ఆసక్తిగా ఉండటమే కాక.. త‍్వరగా వాటి పట్ల ఆకర్షితులవుతున్నారని ఈ సర్వే తెలిపింది. సుమారు 60 శాతం మందికి పైగా మగవాళ్లు వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నట్లు సదరు సర్వే వెల్లడించింది. ఈ నివేదికలో భాగంగా టైర్‌ 1, టైర్‌ 2 సిటీల్లో నివసించే 1,503 మంది నుంచి ఈ సమాచారాన్ని సేకరించి యాప్ పరిశోధకులు అంచనా వేశారు. వీరిలో 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన పురుషులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

కొన్నాళ్లుగా వివాహ బంధంపై భారతీయలు ఆలోచనలు మారుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న చాలా మంది వృత్తి, ఆర్థిక, ఇతర బయట ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు.. సరికొత్త అనుభూతులను పొందేందుకు వివాహేతర సంబంధాలు వైపు మొగ్గు చూపుతున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ తాజా అధ్యయనం ఆధునిక భారతదేశంలో మారుతున్న సంబంధాల గురించి తెలియజేస్తుంది. సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారితో ఈ తరహా సంబంధాలను పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు.

పరిశోధనలో తేలిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 36 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు వర్చువల్‌ విధానంలో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ అధ్యయనంపై గ్లీడెన్‌ కంట్రీ మేనేజర్‌ సిబిల్‌ షిడెల్‌ మాట్లాడుతూ.. ఈ పరిశోధనలో భాగంగా అనేక ఆసక్తికర విషయాలను తెలుసుకున్నామన్నారు.

Show comments