కర్రలకు రాఖీలు కడుతున్న అమ్మాయిలు.. ఎందుకంటే?

Rakhi Festival 2024 : భారత దేశంలో భిన్నమైన సంస్కృతులు, ఆచారాలు ఉన్నాయి. ఎవరి ఆచార సంప్రదాయాలు వారు అనాధిగా పాటిస్తూ వస్తున్నారు. దేశంలో రేపు రాఖీ పండుగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.. కానీ ఆ గ్రామంలో రాఖీ పండుగ విచిత్రంగా జరుపుకుంటారు.

Rakhi Festival 2024 : భారత దేశంలో భిన్నమైన సంస్కృతులు, ఆచారాలు ఉన్నాయి. ఎవరి ఆచార సంప్రదాయాలు వారు అనాధిగా పాటిస్తూ వస్తున్నారు. దేశంలో రేపు రాఖీ పండుగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.. కానీ ఆ గ్రామంలో రాఖీ పండుగ విచిత్రంగా జరుపుకుంటారు.

రేపు భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలో హిందులు ఎక్కడ ఉన్నా రాఖీ పండుగ జరుపుకుంటారు. అన్నా చెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రాఖీ పండుగ వస్తుందంటే చాలు దేశంలో ఎక్కడ చూసినా షాపుల్లో రక రకాల రాఖీలు దర్శనమిస్తుంటాయి. స్వస్తిక్, పూసలు, రంగు రాళ్లు, డైమండ్స్, కార్టూన్ బొమ్మలు ఇలా ఎన్నో రకాల రాఖీలు కనిపిస్తుంటాయి.కాస్త డబ్బు ఉన్నవాళ్లు వెండి, బంగారు రాఖీలు కూడా కడుతుంటారు. మగవాళ్లు తమ చేతులకు రాఖీలతో కనిపిస్తుంటారు.. కానీ ఆ గ్రామంలో మాత్రం మగవాళ్లు రాఖీలతో కనిపించరు.. వారికి బదులు కర్రలు కనిస్తుంటాయి. ఇంతకీ అది ఏ గ్రామం.. మగవాళ్లకు ఎందుకు రాఖీలు కట్టరు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

రేపు సోమవారం (ఆగస్టు 19) దేశ వ్యాప్తంగా రాఖీ పండగు సందర్భంగా సోదరుల చేతకి సోదరీమణులు రాఖీలు కడుతారు.అన్నదమ్ములకు రాఖీ కట్టి వారు చల్లగా అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని సోదరీమణులు దీవిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చేతులకు రక రకాల రాఖీలు కట్టుకుని కనిపిస్తుంటారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని హర్పూల్ జిల్లాలో ఇందుకు భిన్నమైన ఆచారం కనిపిస్తుంది. ఆ జిల్లాలో ఉండే దాదాపు 60 గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరు రాఖీ కట్టుకోరు. రాఖీ సందర్భంగా సోదరులకు రాఖీలు కడితే.. వారు మాత్రం కర్రలకు రాఖీలు కడతారు. ఈ ఆచారం నాలుగైతు వందల ఏళ్లుగా వస్తుందట.

ఈ 60 గ్రామాల ప్రజలు 17వ తరానికి చెందిన హిందూ రాజపుత్రల రాజ మహరాణా ప్రతాప్ కాలం నాటి సంప్రదాయలను ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారట. క్రీస్తు శకం 1576 లో హల్దిఘాటి యుద్దం జరిగింది. యుద్దంలో పాల్గొనేందుకు వెళ్లే సైనికులకు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు భార్య, లేదా సోదరి లేక తల్లి ఎవరో ఒకర రక్షా బంధన్ కట్టి వీర తిలకం దిద్ది పంపేవారట. కానీ హల్దీఘాట్ యుద్దంలో పాల్గొన్న సైనికులకు మహిళలు రక్షా బంధన్ చేతికి కట్టకుండా సైనికుల కర్రలకు కట్టారట. అప్పట్లో చేతులకు రాఖీలు కట్టే సంప్రదాయం అక్కడ లేదట.. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగిస్తూ వస్తున్నారు. దీన్ని స్థానికంగా ఛాడీ పూజ అని పిలుస్తారట. ఆ రోజు ఎక్కడా కూడా జాతర్లు, సంబరాలు జరుపుకోరట. ఏది ఏమైనా మన దేశంలో ఇలాంటి ఆచారం ఇప్పటికీ కొనసాగడం చాలా విచిత్రంగా ఉందని కొంతమంది అంటున్నారు.

Show comments